చాణక్య నీతి: స్త్రీ శరీరాన్ని ఎవరెలా చూస్తారంటే!



ఏవ ఏవ పదార్థస్తు త్రిధా భవతి వీక్షతి
కృపణం కామినీ మాంసం యోగిభిః కామిభిః శ్వభిః



ఒకే సత్యం చాలా రకాలుగా చెప్పొచ్చు, వివిధ రకాలుగా కనిపిస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమయ్యేందుకు చాణక్యుడు చెప్పిన శ్లోకం ఇది



వస్తువు ఒకటే అయి ఉంటుంది కానీ దాన్ని చూసే విధానం ఎవరికి వారిదై ఉంటుంది



స్త్రీ శరీరాన్ని ఒక్కొక్కరు ఒక్కో దృక్ఫథంలో చూస్తారు



ముఖ్యంగా యోగి, రసికుడు, కుక్క చూసే విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది



స్త్రీ శరీరాన్ని కుళ్లిపోయిన మాంసపు ముద్దలా చూసి ఏవగించుకుంటాడు యోగి



స్త్రీ శరీరాన్ని అనుభవించాలన్న ఆశతో చూస్తాడు కాముకుడు(రసికుడు)



అదే శరీరాన్ని ఓ మాంసపు ముక్కలా చూస్తుంది కుక్క



ఒకటే విషయం చూసే విధానం వేరు, సత్యం ఒకటే కానీ కనిపించే పద్ధతి వేరన్నది ఆచార్య చాణక్యుడు భావన



Images Credit: Pinterest