గరుడ పురాణానికి నిష్క్రమించిన ఆత్మ మధ్య సంబంధం ఏంటి..ఇంట్లో ఎవరైనా చనిపోతే అసలు గరుడ పురాణం ఎందుకు చదవాలి
గరుత్మంతుడి ప్రశ్నలకు శ్రీమహా విష్ణువు ఇచ్చిన సమాధానాలే గరుడపురాణం. అష్టాదశ పురాణాల్లో ఇదొకటి
గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ శరీరాన్ని వదిలి, స్వర్గానికి చేరేవరకు ఎదురయ్యే ప్రతి సంఘటన గురించి ఎంతో క్లుప్తంగా వివరించింది.
సాధారణంగా మనిషి మరణించిన తర్వాత శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్తుంది. కొందరు మరణించిన తర్వాత వారి ఆత్మలు వెంటనే వారి శరీరం నుంచి బయటకు వచ్చి మరొకరి శరీరంలోనికి ప్రవేశిస్తాయి.
మరికొన్ని ఆత్మలు ఇతర శరీరంలోకి ప్రవేశించాలంటే సుమారు 10 లేదా 13 రోజుల సమయం పడుతుందని గరుడ పురాణంలో ఉంది. ఈ విధంగా మరణించిన వారి ఆత్మ వారి కుటుంబ సభ్యులను వదిలి వెళ్ళడానికి 13 రోజుల సమయం పడుతుంది.
ఏదైనా ప్రమాదాల్లో మరణించిన వారి నుంచి వారి ఆత్మ బయటకు వెళ్లి తిరిగి పునర్జన్మ పొందడానికి సుమారు ఏడాది కాలం పడుతుందని గరుడపురాణం తెలియజేస్తుంది.
ఆత్మ తమ కుటుంబ సభ్యుల మధ్య తిరిగే సమయంలో గరుడ పురాణం చదవితే ఆ ఆత్మకు శాంతి కలుగి స్వర్గానికి వెళుతుందని అందుకే ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో గురడపురాణం చదవాలని చెబుతారు
గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన పాపాలను బట్టి స్వర్గ నరకాలు నిర్ణయమవుతాయి
గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మోక్షం వైపు నడవాలన్నా, ముక్తిని పొందాలన్నా జీవితకాలంలో సత్కర్మలు చేయాలని గరుత్మంతుడికి చెప్పిన సమాధానంలో వివరించాడు శ్రీ మహావిష్ణువు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.