సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అనంతరం భోజనం చేయాలి
శని త్రయోదశి రోజు మద్యమాంసాలు ముట్టుకోరాదు. శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా శని ప్రభావం తగ్గుతుంది
ఓం నమ:శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా మంచిదే
ఆకలితో అలమటించేవారికి భోజనం పెట్టాలి, మూగజీవాలకు కూడా ఆహారం అందించాలి. ఎవరి వద్ద నుంచి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోవద్దు
నివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయం లో ప్రసాదం పంచండి . రోజుకో నువ్వుల ఉండను కాకికి తినిపించడం మంచిది
శనివారం రోజు రొట్టెపై నువ్వులు వేసి కుక్కలకు పెడితే శని ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఆంజనేయుడి ఆరాధన వలన శనిప్రభావం తగ్గుతుంది, సుందరకాండ పారాయణం చేయండి
కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు ,నల్ల నువ్వులు, మేకు శనికి నమస్కరించి వేయండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే శనిప్రభావం తగ్గుతుంది
ప్రతి శని వారం రాగి చెట్టుకు ప్రదిక్షణం చేయాలి. శనివారం రోజు శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టి, నల్లటి దుప్పటి దానం చేస్తే మంచిది
అయ్యప్ప మాల ధరించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇవ్వడం, కాలభైరవ దర్శనం వల్ల కూడా శనిప్రభావం తగ్గుతుందిట
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు