చాణక్య నీతి: ఈ నలుగురి మధ్యా మీరు ఇన్వాల్వ్ అయితే అంతే!



వ్ప్రయోవ్రీప్రవాహనేశ్చ దంపత్యోః స్వామిభృత్యయోః
అంత్రేణ గంథవ్యం హాలస్య వృషభస్ ||''



ఇద్దరు జ్ఞానుల మధ్య జోక్యం చేసుకోకండి



ఆచార్య చాణక్యుడు చెప్పిన‌ ప్రకారం, ఇద్దరు జ్ఞానులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరూ వారిని అడ్డుకోకూడదు. అలా చేస్తే వారి పనికి ఆటంకం కలుగుతుంది. దీనినే మూర్ఖత్వం అంటారు.



భార్యాభర్తల మధ్యకు వెళ్లవద్దు



ఆనందం, కోపం, వివాదం ఏ సందర్భంలో అయినా భార్యాభర్తల మధ్య ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు. ఏ వ్యక్తి కూడా వారి సంభాషణకు అంతరాయం కలిగించకూడదు. ఇది వారి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం కలిగిస్తుందని చాణ‌క్యుడు చెప్పాడు



నాగలి - ఎద్దుల మధ్య వెళ్లవద్దు



నాగలి, ఎద్దులు కలిసి వెళుతున్న‌ప్పుడు మీరు వాటి మ‌ధ్య‌లోకి వెళ్లి తప్పు చేయకూడదు. అలా వెళితే మీరు గాయాల‌పాలై బాధ ప‌డ‌వచ్చు. ఒక్కోసారి ఈ తప్పు మరణానికి దారితీస్తుందని చాణక్యుడు హెచ్చ‌రించాడు.



య‌జ్ఞం- పండితుల మధ్యకు వెళ్లవద్దు



అగ్నిగుండం దగ్గర పూజారి లేదా వేద పండితులు కూర్చున్నప్పుడు, ఎవరూ వారి మ‌ధ్య‌గా వెళ్ల‌కూడదు. ఇలా చేయడం వల్ల వారి పూజలో ఆటంకాలు ఏర్పడి హవన యాగానికి ఆటంకం కలుగుతుంది.



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఇలాంటోళ్లని మార్చలేం!

View next story