చాణక్య నీతి: సిగ్గుపడకూడని సందర్భాలివే!



ధనధాన్య ప్రయోగేషు విద్యా సంగ్రహేమ చ
ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జః సుఖీభవేత్



సిగ్గు,సంకోచం ఏ ఏ సందర్భాలలో పడకూడదో చాణక్యుడు ఈ శ్లోకంలో వివరించాడు



ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు స్పష్టంగా ఉండాలి ఎలాంటి సంకోచం ఉండకూడదు



ఇచ్చిన డబ్బు తిరిగి పుచ్చుకునేటప్పుడు సిగ్గు -సంకోచం వీడాలి



విద్య నేర్చుకునేటప్పుడు పాఠం బోధపడకపోతే అడిగి సందేహాలు తీర్చుకునేందుకు సిగ్గు,సంకోచాలు పడకూడదు



భోజనం చేస్తున్నప్పుడు అడిగి కడుపునిండా తినేందుకు అస్సలు సిగ్గు పడకూడదు



సంబంధీకుల వ్యవహారంలో స్పష్టంగా మాట్లాడగలగాలి, నిజాయితీ విషయంలో తగ్గకూడదు



ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా కానీ వ్రాతపూర్వకంగా ఉండాలి



Images Credit: Pinterest