తాళికట్టేటప్పుడు 3 ముళ్లే ఎందుకు వేస్తారు!



హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.



వివాహం అనేది జన్మల జన్మల బంధం అని అంటారు. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు



వివాహంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టం తాళి కట్టడం. మూడు ముళ్లు ఎందుకు వేస్తారో తెలుసా



సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అని అర్థం. సూత్రం అంటే తాడు.. అంటే ఆధారమైనది అని అర్థం.



హిందూ సంప్రదాయం ప్రకారం మూడు అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది



త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడు అనేవి మంగళకరమని భావిస్తారు. అందుకే మంగళ సూత్రానికి మూడు ముళ్ల వేస్తారు.



మానవులకు స్థూల, సూక్ష్మ , కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. పెళ్లి సమయంలో ఒక్క ముడి ఒక్కో శరీరానికి వేసేది.



అంటే భాహ్యశరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవుతాను అనే అర్థంలో ఈ మూడు ముళ్లు వేస్తారు.



మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల విశ్వాసం.



శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్త ఆయురారోగ్యాలతో వర్థిల్లుతాడని విశ్వసిస్తారు
Images Credit: Pinterest