శ్రావణ బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ పండుగలివే!



సెప్టెంబరు 1 శ్రావణ బహుళ (కృష్ణ) పాడ్యమి
శ్రావణ బహుళ పాడ్యమి రోజు ధనప్రాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.



శ్రావణ బహుళ విదియ మొదలు నాలుగు నెలల పాటు చాతుర్మాస్య వ్రతం చేయాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా కూడా ప్రసిద్ధి చెందింది.



శ్రావణ బహుళ తదియ రోజు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం
శ్రావణ బహుళ చవితి రోజు గోపూజ చేయాలి
శ్రావణ బహుళ పంచమిని రక్షా పంచమి వ్రతం



శ్రావణ బహుళ షష్ఠి -బలరామ జయంతి
శ్రావణ బహుళ సప్తమి - భానుసప్తమి



సెప్టెంబరు 6- శ్రావణ బహుళ అష్టమి -శ్రీకృష్ణ జన్మాష్టమి
కృష్ణుడిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, విజయం సిద్ధిస్తుందని పురాణోక్తి.



శ్రావణ బహుళ నవమి రోజు చండికా పూజ, కౌమార పూజ ఆచరిస్తారు. రామకృష్ణ పరమ హంస వర్ధంతి కూడా ఈ రోజే.



శ్రావణ బహుళ ఏకాదశిని అజైకాదశి అనీ అంటారు. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు.



సెప్టెంబరు 14- శ్రావణ అమావాస్య
పోలాల అమావాస్యగా జరుపుకుంటారు. ఈరోజు గో పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది. ఈ రోజు వ్యవసాయదారులంతా పశువులతో పనులు చేయించరు.



సెప్టెంబరు 15 సూర్యోదయానికి అమావాస్య ఉండడం వల్ల రోజును కూడా శ్రావణమాస అమావాస్యగా పరిగణిస్తారు. సెప్టెంబరు 16 నుంచి భాద్రపదమాసం ప్రారంభం అవుతుంది.



Images Credit: Pinterest