Sabarimala Online Booking 2024 : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!
Sabarimala Virtual Q Ticket Booking: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు వర్చువల్ క్యూ టికెట్లు ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైమ్ టికెట్ బుక్ చేసుకుంటే ఇది ఫాలో అవండి ...
Sabarimala Virtual Q Ticket Booking Online Easy Process: అయ్యప్పస్వామి దర్శనకోసం భక్తులు భారీగా శబరిమల చేరుకుంటారు. ఏటికేడు రద్దీ పెరుగుతూనే ఉంది. అందుకే కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం దాదాపు 80వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. గతేడాది అయ్యప్ప దర్శనం కోసం వెళ్లిన భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవస్థాన అధికారుల తీరుపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది ట్రావెన్ కోర్ దేవస్థానం. స్వామివారి దర్శనవేళలు పొడిగించింది..రోజుకి 18 గంటల పాటు అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతిస్తోంది. మరోవైపు పదునెట్టాంబడిపై నిముషానికి వెళ్లే భక్తుల సంఖ్యను పెచింది. వీటికి తోడు కేరళ సర్కార్ వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ఓపెన్ చేసింది. నిత్యం ఆన్ లైన్లో 70వేల మంది భక్తులు వర్చువల్ క్యూ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ విధానాన్ని అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
వర్చువల్ క్యూ బుకింగ్ ఇలా ఈజీగా చేసుకోండి
ఫస్ట్ స్టెప్ ... ట్రావెన్ కోర్ దేవస్థానం హోమ్ పేజ్ (https://sabarimalaonline.org) ఓపెన్ చేయాలి.. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే లాగిన్ అవండి... లేదంటే లాగిన్ క్లిక్ చేయాలి
అందులో అడిగిన పేరు, కాంటాక్ట్ నంబర్, ఆధార్ డీటేల్స్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడీ సహా ఈ పేజ్ లో ఇచ్చిన కాలమ్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫొటో అప్ లోడ్ చేయడం చాలా ముఖ్యం. కంటిన్యూ క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు OTP వస్తుంది..దాన్ని ఎంటర్ చేసి మళ్లీ కంటిన్యూ క్లిక్ చేయాలి
ఆతర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే...స్క్రీన్ పై 4 ఆప్షన్లు బాక్సుల రూపంలో కనిపిస్తాయి..అందులో వర్చువల్ క్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
అనంతరం..మీరు ఏ రోజు దర్శనానికి వెళ్లాలి అనుకుంటున్నారో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి...ఏ దారిలో వెళ్లాలో కూడా అక్కడ ఆప్షన్లుంటాయి. పంబ, వడిపెరియార్, ఎరుమేలి..ఇలా ఏ రూట్లో వెళ్లాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. డేట్, వెళ్లే మార్గం సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే...వర్చువల్ క్యూ కోసం ఆ రోజు ఏ ఏ టైమ్ లు అవైలబుల్ ఉన్నాయో స్క్రీన్ పై కనిపిస్తాయి. వాటిలో మీకు వీలైన టైమ్ ను ఎంపిక చేసుకోవాలి.
మీరు ఒక్కరికే టికెట్ బుకింగ్ అయితే సింగిల్ అని... గ్రూపుగా వెళితే గ్రూప్ అని క్లిక్ చేయాలి. వర్చువల్ క్యూ టికెట్ బుకింగ్ ఒకరి లాగిన్ పై ఐదుగురికి టికెట్ బుక్ చేయవచ్చు. సింగిల్/గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక Other అయితే మిగిలిన నలుగురి పేర్లు, డీటేల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
ఒకవేళ మీరు సింగిల్ అయితే... సెల్ఫ్ క్లిక్ చేస్తే అక్కడ మీ డీటేల్స్ ఆటోమేటిగ్గా వస్తాయి.. ఆ పక్కనే ప్రసాదం రకాలు, మీకు కావాల్సిన క్వాంటిటీ కనిపిస్తుంది. వాటిని సెలెక్ట్ చేస్తే వాటికి ఎంత మనీ పే చేయాలో కనిపిస్తుంది...ఆ తర్వాత యాడ్ టు విష్ లిస్ట్ కొట్టాలి... అప్పుడు ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది..క్లిక్ చేయాలి
ప్రొసీడ్ టు పే అని వస్తుంది..మీరు ప్రసాదం ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే దానికి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది.. వర్చువల్ క్యూ బుకింగ్ కి అస్సలు డబ్బులు కట్ కావు...
ఐదేళ్ల కన్నా తక్కువ వయసుగల పిల్లలకు వర్చువల్ క్యూ టికెట్లు అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు..
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు ఆరోగ్య చిట్కాలు - ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి!