ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఐశ్వర్యాన్నిచ్చే ఈ మొక్క మీ ఇంట్లో ఉందా!

శంఖు పూలు...

చాలామంది పూజకు పూలకోసం..మరికొందరు అందం కోసం దీనిని పెంచుతారు. కానీ ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎంత మంచిదో తెలుసా

సమస్యల నుంచి విముక్తి

నిత్యం భగవంతుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఎన్నో సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు పండితులు

వాస్తు ప్రకారం

శంఖపుష్పం మొక్కను ఉత్తరం, తూర్పు,ఈశాన్య దిశల్లో నాటాలి.. ప్రధాన ద్వారానికి కుడివైపు శంఖు పుష్పాల మొక్కను ఉంచడం శుభప్రదం అంటారు.

ఏ రోజు నాటాలి

శంఖు పుష్పాల మొక్కను ఏ రోజంటే ఆ రోజు కాదు.. గురువారం, శుక్రవారం రోజు నాటడం చాలా మంచిది . గురువారం శ్రీ మహావిష్ణువుకి, శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం..అందుకే ఈ రోజుల్లో ఈ మొక్క నాటాలని చెబుతారు

ధనలాభం

శంఖు పుష్పాన్ని సంస్కృతంలో గిరికర్ణిక అంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. శనీబాధల నుంచి విముక్తి కలుగుతుంది

అనుగ్రహం

వాస్తవానికి శంఖు పూలను ఏ రోజు ఆ దేవుడికి సమర్పిస్తే అందరి అనుగ్రహం లభిస్తుందంటారు పండితులు.

ఐశ్వర్యం

పూజలు చేసినా చేయకున్నా ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలు వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది

నదిలో వేసి నమస్కరిస్తే...

సోమవారం , శనివారాల్లో 11 శంఖు పూలను తీసుకెళ్లి నదిలో వేసి నమస్కరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఉండే చికాకులు తొలగిపోతాయట.