తిరుమల

సామాన్య భక్తులకు 3 గంటల్లోపే శ్రీవారి దర్శనం!

Published by: RAMA

సర్వదర్శనానికి గంటల సమయం

తిరుమలేశుడి సర్వదర్శనం అంటే సామాన్యులకు 20 నుంచి 30 గంటల సమయం పడుతోంది..ఈ విధానం మార్చేందుకు సిద్ధమైంది టీటీడీ బోర్డు

నూతన విధానం

కేవలం రెండు మూడు గంటల్లో స్వామివారి దర్శనం కల్పించేందుకు ..IIMను సంప్రదించి ప్రత్యేక కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బి.ఆర్‌.నాయుడు స్పష్టం చేశారు

సామాన్య భక్తుల కోసం

శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తులు చాలావరకూ సామాన్యులే..అందుకే వారికే పెద్దపీట వేయాలన్నది టీటీడీ నూతన పాలక మండలి ఆలోచన

ఇవి అమల్లో ఉన్నాయ్

ప్రస్తుతానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వ దర్శనం లాంటి విధానాలు అమల్లో ఉన్నాయి

కంకణం విధానం

రెండు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం సాధ్యమా అంటే..గతంలో అమలు చేసిన కంకణం విధానం మరోసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది

మూడు గంటల్లోనే దర్శనం

శ్రీనివాసం, విష్ణునివాసంలో ఆధార్ కార్డు ద్వారా భక్తులకు దర్శనానికి టైమ్ కేటాయిస్తారు. ఈ టికెట్లు పరిమితంగా ఉంటాయి. ఇందులో భాగంగా రెండు మూడు గంటల్లోనే దర్శనం జరిగేది..గత ప్రభుత్వం ఈ విధానం రద్దు చేసింది

త్వరలో నూతన విధానం

2 దశాబ్దాల క్రితం TTD ఈవోగా ఐవీ సుబ్బారావు ఉన్నప్పుడు 'కంకణం' విధానం ప్రారంభించారు. భక్తుడి చేతికి ఓ కంకణం ట్యాగ్ చేస్తారు. ఈ విధానంలో రెండుమూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం సాధ్యమయ్యేది. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ కంకణం విధానం తిరిగి అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది

నేరుగా మూలవిరాట్ దర్శనం

మూడు దశాబ్ధాల క్రితం వరకూ సామాన్య భక్తుడు కూడా శ్రీవారి మూలవిరాట్ ను కులశేఖరపడి వరకూ వెళ్లి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం రూ.10,500 చెల్లించిన వారికి మాత్రమే ఇక్కడివరకూ అనుమతి ఉంది

సామాన్య భక్తుడికి వరమే..

ఏ విధానం ద్వారా ఇది అమలు చేసినా కానీ.. రెండు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం సామాన్య భక్తుడికి దొరకడం అంటే శ్రీవేంకటేశ్వరుడి భక్తులకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది..