కొన్ని జాతకాలంతే వెరీ బ్యాడ్ అనుకుంటున్నారా..అయితే మంచిగా మార్చేసుకోండి ఇలా! ఏల్నాటి శని, అష్టమ శని వారు, అర్థాష్టమ శని ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది శని వక్రించినవారు..అంటే శని ఆ రాశి నుంచి వెళ్లిపోయిన మళ్లీ వెనక్కు తిరిగి రావడం అన్నమాట.. జ్యోతిష్య శాస్త్రం మొత్తం తెలిసిన ఆదిశంకరచార్యులు భక్తులకు ఓ వరం ఇచ్చారు మీ జాతకంలో ఏ గ్రహం బాధపెడుతున్నా..గురు గ్రహం అనుగ్రహం ఉంటే ఇతర గ్రహాల ప్రభావం మీపై ఉండదు నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని జపించినవారిని ఎలాంటి పాపగ్రహం ఏమీ చేయలేదు ఎలాంటి విపత్తు నుంచి అయినా, ఎంత కష్టం నుంచి అయినా బయటపడేసేవాడు గురువు.. అందుకు గురువు అనుగ్రహం ఉంటే చాలు..ఎంత చెడుజరగాలని రాసిపెట్టి ఉన్నా మొత్తం మారిపోతుంది దక్షిణామూర్తి వైభవం గురించి చాగంటి కోటేశ్వరావు చెప్పిన విషయాలివి...