కర్నూలు జిల్లాలో రవ్వలకొండ గుహలు - బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసిన గుహలు కర్నూలు జిల్లాలో ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న రవ్వలకొండ - చూడాలంటే ఓ సాహసమే. అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.. రవ్వలకొండ పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేవారు. పశువుల చుట్టూ గీత గీసి.. సమీపంలోని రవ్వలకొండ గుహలో కూర్చుని కాలజ్ఞాన తత్వాలు రాసేవారు. పశువులు గీత దాటేవికావు. రవ్వలకొండ గుహలో బ్రహ్మంగారు, అచ్చమాంబ విగ్రహాలు, ఈ గుహలోంచి శ్రీశైలం, యాగంటికి మార్గాలు రవ్వలకొండ గుహలో బ్రహ్మంగారి విగ్రహానికి నిత్య పూజలు, వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు రాక రవ్వలకొండ గుహల్లోకి వెళ్లడం సాహసయాత్ర లాంటిదే - చిన్న గుహదారి, కింద నీళ్లు రవ్వలకొండ బనగానపల్లె కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలలో లేదా కాలినడకన కొండ పైకి చేరుకోవచ్చు. రవ్వకొండ గుహను చూస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుందని భక్తులు అంటారు. మరి మీరు వెళ్లొస్తారా?