కాశీ..భూమ్మీద మొదటి నగరం ఎలా అయింది! ఒకప్పుడు విశ్వం మొత్తం నీరుండేది..ఎటుచూసినా నీరుతప్ప మరో వస్తువు కనిపించలేదు బ్రహ్మదేవుడు, రుషులు, మునులు ఎవ్వరూ లేరు.. అలాంటి సమయంలో కొంత భూమిని సృష్టించాడు శివుడు ఆ ప్రదేశానికి విష్ణువును ఆహ్వానించి ఇక్కడి నుంచి సృష్టి ప్రారంభించమని చెప్పాడు..విష్ణువు పాదాల నుంచి పుట్టినదే గంగ తాను సృష్టించిన ఆ కొద్ది భూభాగాన్ని నీరు కప్పేయడం చూసిన పరమేశ్వరుడు త్రిశూలంతో ఆ భాగాన్ని పైకెత్తాడు... తిశూలం నాటిన భాగం కావడం వల్లే కాశీగా పేరొచ్చింది. కాశిక అంటే త్రిశూలం అని అర్థం..అలా కాశీ ఉద్భవించింది. సృష్టిలో మొదట పుట్టిన భూభాగం కాశీ... ఆ తర్వాత విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు..బ్రహ్మ నుంచి ఈ సృష్టి మొత్తం ప్రారంభమైంది త్రిశూలంపైన ఉన్న ఆ భూభాగంలో కూర్చునే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు.. ఆ తర్వాత దేవతల విన్నపం మేరకు ఆ భూభాగాన్ని కిందకు దించాడు శంకరుడు అందుకే బ్రహ్మదేవుడి సృష్టి నశించినా, ఈ భూమి మొత్తం ప్రళయం సంభవించినా కాశీపట్టణం మాత్రం చెక్కుచెదరదంటారు.. మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరం కాశీ.. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శించుకున్నవారికి తిరిగి రావాలని అనిపించదు