అరుణాచల గిరిప్రదక్షిణ చేసినంత ఫలితం ఇచ్చే మంత్రం ఇది!
ప్రతి నెలలో పౌర్ణమి రోజు తమిళనాడులో ఉన్న అరుణాచల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది
కొండపై దేవుడు కాదు కొండే దేవుడిగా వెలసిన క్షేత్రం అరుణాచలం. ఈ క్షేత్రంలో గిరిప్రదక్షిణ చేస్తే పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని భక్తుల విశ్వాసం.
పంచభూత లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు అగ్నిలింగా కొలువయ్యాడు. దేవతలు, సిద్ధులు ఇప్పటికీ సూక్ష్మశరీరంతో ప్రదక్షిణ చేసే క్షేత్రం అరుణాచలం
ఇంత గొప్ప క్షేత్రంలో ప్రదక్షిణ చేయాలని భక్తులు ఎంతో తాపత్రయపడతారు. పౌర్ణమి రోజు ఇక్కడ సందడి ఎక్కువ ఉంటుంది కానీ ఏ రోజు ప్రదక్షిణ చేసినా మంచిదే
గిరి ప్రదక్షిణ ఏరోజు చేసినా అరుణాచలేశ్వరుడి కరుణాకటాక్షాలు లభిస్తాయి. అయితే గిరి ప్రదక్షిణ చేసే అదృష్టం లేనివారు అరుణ గాయత్రి చదువుకుంటే ఆ ఫలితం లభిస్తుందంటారు
ఓం నమః స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి
తన్నో రమణ ప్రచోదయాత్
ఇదే అరుణ గాయత్రి, రమణ గాయత్రి.. నిత్యం 27సార్లు ఈ గాయత్రి మంత్రాన్ని స్మరిస్తే గిరి ప్రదక్షిణ చేసినదాంతో సమానం
గుడిలో చేసే మూడు ప్రదక్షిణలకే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ఏకంగా శివుడే కొండగా వెలసిన ప్రదేశంలో ప్రదక్షిణ చేస్తే అంతకు మించిన ప్రశాంతత ఏముంటుంది