శివలింగం ఎన్ని రకాలో తెలుసా!

Published by: RAMA

లింగ రూపంలో శివయ్య

పరమేశ్వరుడిని లింగరూపంలో పూజిస్తారు..అయితే ఆ శివలింగాలు ఎన్ని రకాలో తెలుసా..!

ఎత్తు ఆధారంగా

శివపురాణంలోని విశ్వేశ్వర సంహిత ప్రకారం శివలింగాలు 3 రకాలు - వీటిని ఎత్తు ఆధారంగా విభజించారు

3 రకాల శివలింగం

శివలింగం పరిమాణాన్ని బట్టి ఉత్తమం, మధ్యం, అధమం అని విభజించారు..వీటిలో ఉత్తమ శివలింగం కింద బలిపీఠం ఉంటుంది

మధ్యస్థ శివలింగం

బలిపీఠం నుంచి నాలుగు వేళ్ల కన్నా తక్కువ దూరంలో ఉండేది మధ్యస్థ శివలింగం, అంతకన్నా చిన్నగా ఉండేది అధమ శివలింగం అంటారు

పాదరస శివలింగం

అండాకారంలో ఉండే శివలింగం , పాదరసంతో చేసిన శివలింగం...ఇవో రెండురకాలు.. ఇంకా ఇవి కాకుండా మరో ఆరు రకాలున్నాయి

దేవ లింగాలు

దేవతలు స్థాపించిన వాటిని దేవలింగాలు అంటారు.

అసుర లింగాలు

రావణాసురుడు సహా రాక్షసులు ప్రతిష్టించిన లింగాలను అసురలింగాలు అంటారు

అర్షలింగాలు

మునులు, మహర్షులు ప్రతిష్టించిన శివలింగాలను అర్షలింగాలు అంటారు.

మానవ లింగాలు

పురాణకాలం నుంచి ఉన్న వాటిని పురాణలింగాలు అంటారు. మనషులు ప్రతిష్టించిన శివలింగాలను మానవలింగాలు అంటారు

స్వయంభూ లింగాలు

ఎవరూ ప్రతిష్టించకుండా స్వయంగా శివయ్యే వెలిస్తే..వాటిని స్వయంభూ లింగాలు అంటారు