నవంబరు 15 శుక్రవారం

కార్తీక పౌర్ణమి విశిష్టత!

Published by: RAMA

కార్తీక పౌర్ణమి

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు..దీనిని మహాశివరాత్రిలో సమానమైన పర్వదినంగా భావిస్తారు

త్రిపురి పూర్ణిమ

కార్తీక పౌర్ణమినే 'త్రిపురి పూర్ణిమ', 'దేవ దీపావళి' అని కూడా పిలుస్తారు..కార్తీకమాసం నెలంతా ఓ లెక్క..పౌర్ణమి ఒక్కరోజు మరో లెక్క

పౌర్ణమి నియమాలు

కార్తీక మాసం నెల రోజులు నియమాలు పాటించలేనివారు పౌర్ణమిరోజు స్నానం , దీపం, దానం చేస్తే శివసాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం

తారకాసుర సంహారం

మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజిది..అందుకే ఆ రాక్షసుడి సంహారానికి గుర్తుగా ఆనందంగా దీపాలు వెలిగించి పరమేశ్వరుడిని కీర్తించారు ప్రజలు

శివకేశవులకు ప్రీతికరం

కార్తీక పౌర్ణమి పరమేశ్వరుడికి, శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన రోజు. ఈ రోజు దీపం వెలిగించి నమస్కరిస్తే తెలిసీ, తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని భక్తుల విశ్వాసం

సకల శుభకరం

కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం, సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయంటారు..ఆలయాల్లో నిర్వహించినా మంచిదే

నదీ స్నానం

కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున సముద్రం లేదా నదిలో స్నానమాచరించడం అత్యుత్తమం. అనంతరం దీపాలు వెలిగించి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు

365 వత్తులు

కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు..నిత్యం దీపారాధన చేయలేనివారు రోజుకో ఒత్తి చొప్పున దీపం మొత్తం 365 వత్తులు వెలిగిస్తారు

ఆలయం/గృహం

శివాలయం, వైష్ణవ ఆలయం లేదంటే ఇంట్లో తులసి మొక్క దగ్గర అయినా 365 వత్తులతో దీపాలు వెలిగిస్తారు.

పుణ్య ఫలం

కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలం, పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఫలం