దీపావళి రోజు లక్ష్మీపూజ ముహూర్తం ఇదే!

సాధారణంగా ఆశ్వయుజ బహుళ చతుర్థశి మర్నాడు అమావాస్య.. ఈ రోజు దీపావళి జరుపుకుంటారు

దీపావళి రోజు సూర్యాస్తమయం సమయంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీపూజ చేస్తారు

ఈ ఏడాది (2024) చతుర్థశి, అమావాస్య తిథులు ఒకేరోజు రావడం అమావాస్య తగులు మిగులు రావడంతో రెండు పండుగలు ఒకేరోజు

అక్టోబరు 31 ఉదయం నరకచతుర్థశి, సాయంత్రం దీపావళి అమావాస్య జరుపుకోవాలి

అమావాస్య తిథి సూర్యాస్తమయం సమయానికి ఉండడం ప్రధానం..అందుకే అక్టోబరు 31 దీపావళి

దీపావళి రోజు లక్ష్మీపూజ చేసేందుకు మూహూర్తం చూసుకునేవారున్నారు..కానీ సూర్యాస్తమయం అయితే చాలు పూజ చేసుకోవచ్చు

సాధారణంగా వర్జ్యం, దుర్ముహూర్తం ఉదయం , మధ్యాహ్నం సమయాల్లో ఎక్కువగా ఉంటాయి కానీ సంధ్యాసమయంలో ఉండవు

అందుకే సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ క్షణం అయినా లక్ష్మీపూజ చేసుకోవచ్చు

లక్ష్మీపూజ చేసి తియ్యటి పదార్థాలు అమ్మవారికి నివేదించి..ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇల్లంతా దీపాలు వెలిగించాలి