కార్తీకమాసం

దీపదానం సమయంలో ఎన్ని వత్తులు వేయాలి!

Published by: RAMA

దీపదానం

కార్తీక శుద్ధ ద్వాదశి రోజు దీపదానం చేయాలని సూచించారు వ్యాసమహర్షి .. ఆలయంలో అయినా, తులసి కోట దగ్గరైనా దీపదానం చేయొచ్చు

పాపాలు నశించే దీపదానం

ఒక వత్తి వేసిన దీపదానంతో సకల పాపాలు నశిస్తాయి...అంతకన్నా ఎక్కువ దీపాలు దానం చేసినవారి మిక్కిలి ఫలితం లభిస్తుంది

రాజయోగం

ఓ వత్తితో దీపం పెడితే బుద్ధిశాలి..నాలుగు వత్తులు వేస్తే రాజయోగం

విష్ణుసాయుజ్యం

పది వత్తులు వేస్తే విష్ణుసాయుజ్యం ..వేయివత్తులు వేస్తే విష్ణురూపుడగును

ఆవునేయి శ్రేష్టం

దీప దానానికి ఆవునేయి శ్రేష్టం..నువ్వుల నూనె మధ్యమం
ఆవునేయి జ్ఞానం, మోక్షాన్నిస్తుంది. నువ్వుల నూనె సంపదను కీర్తినిస్తుంది

శత్రుజయం

అడవినూనె కామ్యార్థప్రదం , ఆవనూనె కోర్కెలు నెరవేరుస్తుంది
అవిసెనూనె శత్రువులను జయిస్తుంది, ఆముదం ఆయుష్షు తగ్గిస్తుంది

దోషం లేకుండా!

బఱ్ఱె నేయి గతంలో చేసిన పుణ్యాన్ని కూడా తొలగించేస్తుంది
పై వాటిలో ఆవునేతి బొట్టుని జోడిస్తే దోషం ఉండదు

దీపదాన మహిమ

దీపదానం వల్ల ఇంద్రాదులు పదవులు పొందారు..
దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షం పొందుతారు

సకలపాపహరం

ద్వాదశి రోజు దీపదానం చేసినా, దీపాల వరుస చూసినా వారి పాపాలన్నీ నశిస్తాయి..