చాణక్య నీతి: మీ చుట్టూ ఉండేవారు కాదు మీరెలా ఉన్నారో చూసుకోండి!

ఏదైనా జరగడానికి వాళ్లు కారణం, వీళ్లు కారణం కాదు..మీరేంటో ఆలోచించండి అని సూచించారు చాణక్యడు

ఎప్పుడూ విజయమే సాధించాలి , ఓటమి అస్సలు ఉండకూడదనే అనుకుంటారంతా..ఆ దిశగానే అడుగువేస్తారు

మీ విజయం - పరాజయం ఈ రెండూ మీ ఆలోచనా విధానం, మీ మార్గం, మీ చుట్టూ వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని బోధించారు

మీ ముందు అభిమానం ప్రదర్శించి వెనుక సమస్యలు క్రియేట్ చేసేవారికి దూరంగా ఉండాలి

ఎవరిని అయినా కానీ అతిగా నమ్మేయవద్దు..ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్లనుంచి వచ్చే సమస్యలు మీరు ఊహించలేరు

తమ పని అయితే చాలు..మీ ఆలోచనలో సంబంధం లేని వ్యక్తులను వదిలించుకోవడమే మంచిది..

మీ చుట్టూ ఉండేవారి తీరెలా ఉందో కాదు..మీరు నిజాయితీగా, స్పష్టంగా ఉన్నారో లేదో ఆలోచించుకోవాలి

కష్టపడి పనిచేయండి..సోమరితనం వదిలేయండి..అలా అయితే సక్సెస్ కాస్త లేటైనా కానీ రావడం పక్కా

మీరు పనిచేసే రంగంలో నిపుణుల సలహాలు , పెద్దల సలహాలు తీసుకున్నాక అడుగేస్తే విజయం మీ సొంతం