తులసి మహత్యం

క్షీరాబ్ధి ద్వాదశి రోజు తప్పనిసరిగా చదవాలి!

Published by: RAMA

తులసిపూజ

కార్తికమాసంలో తులసిపూజ చేసేవారు ఉత్తమలోకాలను పొందుతారు. క్షీరాబ్ధి ద్వాదశి రోజు అయినా తులసి పూజ చేయని వారు కోటిజన్మలు చండాలులై జన్మిస్తారు.

విష్ణు సాయుజ్యం

తులసి మొక్క వేసి దాన్ని జాగ్రత్తగా పెంచినవారు తులసికి ఎన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగాలు విష్ణులోకంలో ఉంటారు, తులసితో బృందావనం వేసినవారు బ్రహ్మత్వం పొందుతారు

మృత్యుభయం ఉండదు

ఇంట్లో తులసి మొక్క ఉంటే అపమృత్యు భయం ఉండదు. రోగాలకు తావుండదు..

తులసి మహత్యం

కాశ్మీర దేశానికి చెందిన హరిమేధ, సుమేదులు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ స్థలంలో తులసి తోటను చూస్తారు.

తులసిపై భక్తి

వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారం చేయగా..ఎందుకలా చేశావని అడిగాడు హరిమేథుడు. అప్పుడు సుమేధుడు ఓ పెద్ద వృక్షం కింద కూర్చుని తులసి మహత్యం చెప్పాడు

లోకాలను పావనం చేసే తులసి

పాలసముద్రం చిలికినప్పుడు వచ్చిన అమృత కలశాన్ని పట్టుకుని విష్ణువు దానిపై ఆనందభాష్పాలు విడువగా జన్మించినదే తులసి. ఇదే రోజు తులసిని వివాహం చేసుకున్న విష్ణువు నువ్వు లోకాలను పావనం చేయగలదానవని చెబుతాడు

నారాయణుడికి ప్రీతికరం

నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన తులసిని మొక్కితే సాక్షాత్తూ విష్ణువు పూజ చేసినట్టే అని ఆ బ్రాహ్మణుడు మరో బ్రాహ్మణుడికి వివరిస్తాడు

దివ్య పురుషులు

తులసి మహత్యం పూర్తైన వెంటనే వాళ్లు కూర్చున్న వృక్షం రెండుగా చీలి ఇద్దరు దివ్యపురుషులు బయటకు వచ్చారు. దేవలోకానికి చెందిన మేము కామవికారంతో రోమశ మహర్షి తపస్సుని భంగపరిచాం అని అందుకే ఈ శాపం అని చెప్పారు

సకల పాపాలు తొలగించే తులసి పూజ

తులసి మహత్యం వినడం వల్ల పూర్వ జన్మలు పొందాం అని చెప్పి..మీకు తీర్థయాత్రల ఫలితం లభించిందని ఆ బ్రాహ్మణులకు వివరించి ఆ దివ్యపురుషులు స్వర్గలోకానికి వెళ్లిపోయారు