క్షీరాబ్ధి ద్వాదశి పూజ ఎప్పుడు చేయాలి!
కార్తీక పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా జరుపుకుంటారు.. కార్తీకమాసంలో ఈ రోజుకి చాలా విశిష్ఠత ఉంది
ఈ ఏడాది 2024లో ద్వాదశి తిథి తగులు, మిగులు రావడంతో ఏ రోజు ద్వాదశి పూజ చేసుకోవాలి, దీపాలు ఎప్పుడు వెలిగించుకోవాలి అనే గందరంగోళం నెలకొంది
నవంబరు 12 మంగళవారం సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉంది..అంటే మంగళవారం కార్తీక శుక్ల ఏకాదశి.. ఈ లెక్కన బుధవారం ద్వాదశి అని ఫిక్సవొచ్చు కానీ...
ఏకాదశి ఘడియలు నవంబరు 12 మధ్యాహ్నం వరకే ఉన్నాయి.. మధ్యాహ్నం నుంచి ద్వాదశి ఘడియలు మొదలవుతున్నాయి
నవంబరు 13 ఉదయం పదిన్నర సమయానికి ద్వాదశి పూర్తైపోతోంది.. అంటే ఈ లెక్కన ద్వాదశి పూజ నవంబరు 12 మంగళవారం చేయాలా అనే సందేహం ఉంది
వాస్తవానికి తిథి ఉన్న సమయంలో పూజ చేయాలి అనుకోవడంలో తప్పేం లేదు..కానీ ద్వాదశి తిథి సూర్యోదయానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి
నవంబరు 12 మంగళవారం కార్తీక శుక్ల ఏకాదశి...నవంబరు 13 బుధవారం క్షీరాబ్ధి ద్వాదశి.. ఎలాంటి సందేహం లేకుండా ద్వాదశి పూజ నవంబరు 13 సాయంత్రం చేసుకోవాలి
ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు కార్తీక శుక్ల ద్వాదశి రోజుతో ఆ దీక్షను ముగిస్తారు.. అందుకే ఈ రోజుని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు.
ఈ రోజు శ్రీ మహా విష్ణువు కొలువైన ఉసిరికి... తులసికి కళ్యాణం జరిపిస్తారు.