కార్తీకదీపం వెలిగించి ఈ శ్లోకం చదవండి!

Published by: RAMA

ఓం నమఃశివాయ

కార్తీకమాసంలో నెల రోజులూ సాయం సంధ్య వేళ తులసికోట దగ్గర, ఇంటి ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తారు

365 వత్తులు

నిత్యం కుదరకపోయినా కానీ కనీసం కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా దీపాలు వెలిగిస్తారు.. ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన ఫలితం కోసం 365 వత్తులు వెలిగిస్తారు

దీపం శ్లోకం

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి టైం శ్వవచాహి విప్రాః!!

సకల జీవులకు పుణ్యం

చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు... ఇలా భూమ్మీద నివశించే ప్రతి జీవి ఈ దీపం దర్శించుకుంటే మరుజన్మ లేకుండా అనంత పుణ్యం పొందాలి

జన్మ ధన్యం కావాలి

ఈ దీప కాంతి ప్రసరించడం వల్ల మరుజన్మలో వేదాలు అభ్యసించే లోకోపకారి అయిన బ్రాహ్మణ జన్మ పొంది ఉద్ధరింపబడాలి అని అర్థం

అందరి మంచి కోరుతూ..

“లోకా స్సమస్తా స్సుఖినో భవంతు” అనే సంకల్పం ఇప్పటికీ భారతీయులంతా చెప్పుకుంటారు..అందులో భాగం కార్తీక దీపం

ఇదే ఆంతర్యం

మనం మాత్రమే కాకుండా మనచుట్టూ ఉండేవారు లబ్ది పొందాలని కోరుకోవడమే ఆరుబయట వెలిగించే దీపం ఆంతర్యం

దీపం సాక్షాత్తూ త్య్రంబకుడే

కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపం సాక్షాత్తూ త్య్రంబకుడే..అందుకే ఆ దీపాన్ని దర్శించి భక్తితో ప్రార్థించండి