కార్తీక వనభోజనాలకు మంచి ప్రదేశం!

APలో సరస్వతీ దేవి స్వయంభూ ఆలయం ఇది

Published by: RAMA

ఏపీ బాసర

తెలంగాణలో బాసర క్షేత్రంలా ఆంధ్రప్రదేశ్ లోనూ సరస్వతీ దేవి విశిష్ట ఆలయం ఉంది..ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది..

కొలను భారతి

సరస్వతీదేవి ద్వాదశ నామ స్తోత్రాల్లో మొదటినామం అయిన భారతి పేరుతో వెలసిన క్షేత్రం ఇది ..కొలను పక్కనే కొలువై ఉండడంతో కొలను భారతి అనే పేరు

అతి ప్రాచీనమైన క్షేత్రం

కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం నల్లమల కొండల్లో చారు ఘోషిణీ నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం అతి ప్రాచీనమైనది

స్వయంభూ

సత్యయుగంలో సప్త ఋషులంతా యాగం చేసేందుకు వచ్చినప్పుడు వారి సంరక్షణ కోసం అమ్మవారు స్వయంగా ఇక్కడకు వచ్చి వెలసినట్టు స్థలపురాణం

కార్తీకమాసం ప్రత్యేకం

రాయలసీమ పరిధిలో ఉన్న ఈ క్షేత్రంలో కార్తీక మాసం, నవరాతి ఉత్సవాలు, మహా శివరాత్రి, వసంతపంచమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

చేతిలో పుస్తకం

శ్రీ చక్ర సంచారిణీ యంత్రంలో ఆదిశంకరాచార్యల వారు కొలను భారతి అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారు వీణతో కాకుండా చేతిలో పుస్తకంతో దర్శనమిస్తుంది

7 శివాలయాలు

కొలను భారతి ప్రధాన దేవాలయం చేరువలో ఏడు శివాలయాలున్నాయి. ఇవన్నీ ఎర్రరాయితో నిర్మించినవే. శిథిలావస్థలో ఉన్న వీటిలో ఓ ఆలయాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు

ఆత్మకూరు సమీపంలో

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నుంచి రోడ్డు మార్గంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

వనభోజనాలు

ఈ సమీపంలో ఉన్న సుందరమైన జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తుంది. కార్తీక వనభోజనాలకు అద్భుతమైన ప్రదేశం