కార్తీక పౌర్ణమి రోజు మీరు చేయాల్సినవి ఇవే!

Published by: RAMA

త్రిపుర పూర్ణిమ

ఈ ఏడాది నవంబర్ 15 శుక్రవారం కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ రోజునే త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు

స్నానం-దానం

కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానం, వెలిగించే దీపం, చేసే దాన - ధర్మాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది

పుణ్య స్నానాలు

కార్తీక పౌర్ణమి రోజు వేకువజామునే నిద్రలేచి సముద్రం, నది, చెరువులు, బావులు...ఇలా మీకు అందుబాటులో ఉన్న నీటివనరుల్లో స్నానమాచరించండి

కార్తీక దీపం

స్నానానంతరం తీరంలో దీపాలు వెలిగించి కార్తీకదామోదరుడిని స్మరించండి..ఇంట్లో అయితే తులసిమొక్క దగ్గర దీపం వెలిగించండి

దీప దానం

నదీతీరంలో లేదంటే ఆలయాల్లో కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేయడం అత్యుంత పుణ్యఫలం

పారాయణం

కార్తీక పౌర్ణమి రోజు విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం సర్వం శుభకరం

చంద్రుడి పూజ

చంద్రుడి ప్రతిమను పాలతో నీటితో శుద్ధి చేసి అర్ఘ్యం సమర్పించి పూజ చేయడం ద్వారా చికాకులు తొలగి జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని విశ్వసిస్తారు

దాన ధర్మాలు

ఆవును దానం చేయొచ్చు, పేదలకు ఆహారం - దుస్తులు దానంగా ఇవ్వండి

శివ కేశవులు

ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ