శబరిమలకు పోటెత్తిన భక్తులు

అయ్యప్ప స్వామి దర్శనానికి సమయం పొడిగింపు!

Published by: RAMA

మండల-మకరవిళక్కు

మండల-మకరవిళక్కు సీజన్‌లో భాగంగా కేరళల శబరిమల అయ్యప్ప ఆలయం తెరచుకుంది..తొలి రోజే భక్తులు పోటెత్తారు

భక్తుల రద్దీ

నవంబరు 16 తెల్లవారుజామునుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. మొదటి రోజు వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నారు

గంట ముందే...

భక్తుల రద్దీ దృష్ట్యా ఓ గంట ముందే ఆలయాన్ని తెరిచినట్టు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది

సమయం పొడిగింపు

గడిచిన సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో అయ్యప్పస్వామి దర్శనాలకు సమయాన్ని పొడిగించారు

ప్రత్యేక పూజల అనంతరం...

నవంబరు 16 శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన అర్చకుడు అరుణ్‌ కుమార్‌ నంబూథిరి ఆలయ గర్భగుడిని తెరిచారు.. ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అనుమతించారు

డిసెంబరు 26 వరకూ

మండల మకరవిళక్కు సీజన్ డిసెంబరు 26 వరకూ కొనసాగుతుంది.. ఆ తర్వాత 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారు

మకరవిళక్కు సీజన్

డిసెంబరు 30 నుంచి జనవరి 20, 2025 వరకూ మకరవిళక్కు సీజన్ కొనసాగుతుందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది

రోజుకి 18 గంటలు..

తెల్లవారు జామున 3 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ...మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 11 గంటల వరకూ నిత్యం 18 గంటల పాటూ అయ్యప్ప దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు