చాణక్య నీతి: అందరూ మంచోళ్లే అనుకుంటున్నారా! మనుషులంతా మంచివాళ్లే అని కొందరు నమ్ముతారు..అందుకే ప్రతి విషయం చెప్పేస్తుంటారు ఇదే తగదని ఆచార్య చాణక్యుడు సూచించారు.. అర్థమయ్యే ఉదాహరణలతో వివరించి మరీ చెప్పారు ప్రతి పర్వతంలోనూ అమూల్యమైన రత్నాలు ఉండవు..అలా ఉంటాయని ఊహించడం సరికాదు ప్రతి ఏనుగు తన నుదుటిమీద ముత్యాన్ని కలిగి ఉండదు..ప్రతి ఏనుగూ పూజలందుకోలేదని గ్రహించాలి ప్రతి అడవిలోనూ మంచి గంధం చెట్లు మాత్రమే ఉండవు.. విష వృక్షాలు కూడా ఉంటాయ్ అందుకే..మనుషుల్లోనూ విభిన్న మనస్తత్వాలున్నవారు ఉంటారు..అందరూ ఒకటే అని భావించడం మీ తప్పు ఏం చేయాలి అనుకుంటున్నారో మీ ఆలోచనల్లో ఉంచుకోండి...ప్రతి రహస్యాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఎంత దగ్గర వ్యక్తిని అయినా నమ్మి మీ రహస్యాలు చెప్పడం సరికాదంటారు ఆచార్య చాణక్యులు ఆ వ్యక్తికి కోపం వచ్చినప్పడు మీ రహస్యాలన్నీ అందరి ముందూ బయటపెట్టేందుకు అస్సలు వెనుకాడరు..మనుషులు మనస్తత్వం ఇదే..