Karthika Somavaram: కార్తీక సోమవారం రోజు ఇలా చేయండి...
కార్తీకమాసంలో సోమవారాలు పరమ పవిత్రమైనవి. శివకేశవులకు చాలా ప్రీతీకరమైన రోజు. ఈ రోజు ఆచరించాల్సిన విధానంపై ఆరు మార్గాలు సూచించాయి పురాణాలు.
![Karthika Somavaram: కార్తీక సోమవారం రోజు ఇలా చేయండి... Karthika Somavaram: How To Do Fasting In Karthika Masam Karthika Somavaram: కార్తీక సోమవారం రోజు ఇలా చేయండి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/08/86ed7ee018c38332ddb36ed0cff5ff4d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుని ఆజ్ఞతోనే నడుస్తుంది. ఎనిమిది దిక్కులకు, నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా తొలగిపోతుందట. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. కార్తీక సోమవారం అంటే మరింత ప్రీతి. ఈ రోజున ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, దారిద్ర్య బాధలు తొలగిపోతాయంటారు. కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారమైనా కొన్ని విధులు ఆచరించిన వారు అశ్వమేథ యాగాన్ని చేసిన ఫలితం పొందుతారని పండితులు చెబుతారు.
1.ఉపవాసం: శక్తిగలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా అభోజనము అంటే ఉపవాసంతో గడిచి సాయంత్రం శివుడికి శక్తికొలది పూజ, అభిషేకం నిర్వహించి, నక్షత్ర దర్శనం చేసుకుని తులసి తీర్థం సేవించాలి
2.నక్తము: పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ పూర్తైన తర్వాత కానీ ఏదైనా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత కానీ నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయాలి.
3 ఏకభక్తం: రోజంతా ఏమీ తినకుండా ఉండలేం అనుకున్న వారు స్నాన దాన జపాలను యథావిధిగా చేసికుని మధ్యాహ్న భోజనం చేసి, రాత్రి భోజనానికి బదులు ఏదైనా తీర్థం స్వీకరించాలి.
4 అయాచితము: రోజంతా ఉపవాసం ఉండి తమకి తాము భోజనం ప్రిపేర్ చేసుకోకుండా ఎవరైనా పిలిస్తే వెళ్లి భోజనం చేయడం ఆయాచితము అంటారు.
5.స్నానము: ఉపవాసం, నక్తము, ఏకభుక్తం, అయాచితం వీటిలో ఏవీ పాటించలేని వారు కనీసం సూర్యోదయానికి ముందు స్నానం చేసి జపం చేసుకున్నా చాలని చెబుతారు.
6. తిలదానం: మంత్ర జపవిధులు తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజు నువ్వులు దానము చేసినా సరిపోతుంది.
పై ఆరు పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుందని పండితులు చెబుతారు. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతం మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవంతుడి ధ్యానంలో గడిపేవారు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారని అంటారు.
Also Read: నాగ పూజ మూఢనమ్మకమా- సర్పాలు, నాగులు, పాములు వీటి మధ్య వ్యత్యాసం ఏంటి, వేటిని పూజించాలి
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: కేదార్ నాథ్ లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలివే...
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
Also Read: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)