X

Spirituality: పూటకో రూపం.. అక్కడ అమ్మవారిని టచ్ చేస్తే ప్రళయం తప్పదట..

మన దేశంలో శక్తివంతమైన పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటి వెనుక చాలా రహస్యాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి ఉత్తరాఖండ్ లో ఉన్న 'ధారాదేవి' ఆలయం. ఇక్కడ ప్రతిరోజూ జరిగే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారంతా.

FOLLOW US: 

ఉత్తరాఖండ్ వాసులకు ఆరాధ్య దేవత ధారీదేవి. కాళీమాతకు మరో రూపమైన ధారీదేవి.. చార్ ధామ్ క్షేత్రాలకు నాయక. బద్రీనాథ్‌కు శ్రీనగర్‌కు వెళ్లే దారిలో కల్యాసౌర్ గ్రామంలో అలకానంద నది ఒడ్డున ఉంది ధారీదేవి ఆలయం. అమ్మవారు..అలకనందా నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తుందని అక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయం గురించి మహాభారతంలో ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలో పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో ఉంది. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే ధారీదేవి. 
Also Read:  శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే 
విగ్రహాన్ని కదిలించాలని చూస్తే...
భక్తితో కొలిచినవారిని అనుగ్రహించే దేవత అయిన ధారాదేవిని ధిక్కరిస్తే అంతే కీడు జరుగుతుందని చెబుతారు. క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ రాజు పడగొట్టాలని ప్రయత్నించాడట.  ఆ సమయంలోనే  కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయిందంటారు. ఈవిపత్తును  ప్రత్యక్షంగా చూసిన ఆ రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని పారిపోయాడట. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి వెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదని స్థానికులు అంటారు. 2013 మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలిగించడమే ప్రధాన కారణం అంటారు. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలో కొండపై ప్రతిష్ఠించింది. ఆ మరుసటి రోజే కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్రరూపం దాల్చి విలయ తాండవం చేసింది. దాదాపు  10 వేలమంది మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో  మళ్లీ విగ్రహాన్ని అదే స్థానంలో ప్రతిష్టించారు. 
Also Read: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది
గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఉన్న ఈ ధారాదేవి ఆలయం...గర్భగుడిలో అమ్మవారు సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్‌లో ఉందని చెబుతారు. కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు.  ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈపీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తరదిక్కుకి అధిపతి బుధుడు. బుధుడు అహింసను ప్రభోదిస్తాడు. ఆ ఫలితంగా ఉత్తరదిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే కాళీమాత శాంతిస్తుందిని చెబుతారు. 
పూటకో రూపం
ఇక ఆలయంలో అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఉదయం బాలికగా, మధ్యాహ్నం నడి వయసు మహిళగా, సాయంత్రం వృద్ధురాలిగా మారుతుందట. అమ్మవారు ఎంత శక్తి,మహిమగలదో చెప్పడానికి ఇంతకన్నా ఏ కారణాలుంటాయి అంటారు అక్కడి స్థానికులు. 
Alos Read: ఈ రాశులవారు కోపం తగ్గించుకోవాల్సిందే .. అందులో మీరున్నారా.. ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి
Alos Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...  
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉన్నాయా… అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే..
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
Also Read: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Girl In The Morning Young Woman In The Afternoon Old Woman In The Evening Powerful Goddess Dhari Devi Mandir In Uttarakhand

సంబంధిత కథనాలు

Mahabharat: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..

Mahabharat: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Spirituality: పెళ్లయిన అమ్మాయిలు నల్ల పూసలు ఎందుకు వేసుకోవాలి? అవి లేకపోతే ఏమవుతుంది?

Spirituality: పెళ్లయిన అమ్మాయిలు నల్ల పూసలు ఎందుకు వేసుకోవాలి? అవి లేకపోతే ఏమవుతుంది?

Spirituality: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఆ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!

Spirituality: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఆ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!

Shakunam: తుమ్ము మంచి శకునమే కానీ షరతులు వర్తిస్తాయట..

Shakunam: తుమ్ము  మంచి శకునమే కానీ షరతులు వర్తిస్తాయట..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

New Covid Omicron Variant BA.2 : ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

New Covid Omicron Variant BA.2 :  ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

Naga Shaurya: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..

Naga Shaurya: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..

Sourav Ganguly vs Virat Kohli: కోహ్లీకి దాదా షోకాజ్‌ నోటీసులు.. మరో వివాదం.. నిజమెంత?

Sourav Ganguly vs Virat Kohli: కోహ్లీకి దాదా షోకాజ్‌ నోటీసులు.. మరో వివాదం.. నిజమెంత?

Telangana News: బండి సంజయ్‌ అరెస్టుపై సీఎస్‌, డీజీపీకి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Telangana News: బండి సంజయ్‌ అరెస్టుపై సీఎస్‌, డీజీపీకి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు