Different Tip to Celebrate Christmas 2023: క్రిస్టియన్స్ మాత్రమే కాదు క్రిస్మస్ కి మీరూ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు!
Christmas Celebrations 2023: సర్వమత సమ్మేళనం అయిన మనదేశంలో కొన్ని పండుగలు అంతా కలిసే జరుపుకుంటారు. మరి క్రిస్మస్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నవారు ఈ ఏడాది ఇలా చేసుకోవచ్చు...
Different Tip to Celebrate Christmas 2023: హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతానికి చెందిన దేవుడైనా చెప్పేది ఒకటే. మంచి ఆలోచించు, నలుగురికి సహాయం చేయు, మనసులోకి చెడు ఆలోచనలు రానివ్వొద్దు, ఎదుటి వ్యక్తి బాధపడేలా ప్రవర్తించవద్దు. ఎన్ని మత గ్రంధాలు చదివినా..ఎందులో ఏం చెప్పినా..అన్నింటి కామన్ ఉద్దేశం మాత్రం ఇదే. ముఖ్యంగా స్నేహానికి మతానికి అస్సలు సంబంధం ఉండదు. మన స్నేహితుల్లో అన్ని మతాల వారు ఉంటారు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఇలా ముఖ్యమైన పండుగల సమయంలో అంతా కలసే సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అంటే ఏ పండుగను అయినా ఓ మతానికి సంబంధించినది మాత్రమే అని ఆలోచించకుండా అందరం కలసి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటి వారికోసం కొన్ని టిప్స్ ఇవిగో...
Also Read: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!
మీరు శాంటాగా మారిపోండి
క్రిస్మస్ అంటే కానుకల పండుగ. ఈ రోజు శాంటా అందరికీ బహుమతులు అందిస్తారని అంటారు. ఈ పండగ సందర్భంగా తమకు వచ్చే బహుమతుల కోసం వేచిచూస్తుంటారంతా. అందుకే మీరే శాంటా క్లాజ్‌గా మారిపోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకే కాదు.. రాత్రిళ్లు మురికి వాడలకు వెళ్లి అక్కడి పిల్లలకు కూడా బహుమతులను అందించండి. దీనివల్ల మీరు పొందే ఆనందం అనిర్వచనీయం.
అనాథలతో స్పెండ్ చేయండి
మీరు శాంటాగా మారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతులు అందిస్తుంటారు. అయితే బహుమతులు కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు..నిజంగా ఆ బహుమతులు అవసరం అయ్యే అభాగ్యులు, వాటిని చూసి నిజమైన ఆనందాన్ని వ్యక్తం చేసేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అనాథాశ్రమాల్లో ఉన్న పిల్లలు, రోడ్డుపక్కనుండే బిచ్చగాళ్ల పిల్లలు...ఇలాంటి వారికి క్రిస్మస్ సందర్భంగా బహుమతులు ఇస్తే వారి కళ్లలో కనిపించే మెరుపుని మించిన ఆనందం మీ మనసుకి మరొకటి ఉండదు. కుదరితే బహుమతులు ఇవ్వండి లేదంటే వాళ్లతో మాట్లాడి ఏం కావాలి అని అడిగితే అది మీ స్థోమతకు తగ్గట్టు కొనివ్వండి. ఎందుకంటే వాళ్లకి అడిగింది కొనిచ్చే అమ్మానాన్న లేరు... లోకానికి రక్షకుడు అయిన ఏసు జన్మదినం రోజు మీరు వాళ్లకి తల్లిదండ్రుల స్థానంలో ఆ లోటు తీర్చేందుకు ప్రయత్నిస్తే అంతకు మించిన పండుగ మరొకటి ఉండదు.
Also Read: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
కేక్, కుకీస్, వంటకాలు చేసుకోండి.
క్రిస్మస్ అంటేనే కేకుల సంబరంయ..నెల రోజుల ముందు నుంచీ కేకుల తయారీలో బిజీగా ఉంటారు. రమ్ కేక్, కుకీస్, పేస్ట్రీలు, హాట్ చాక్లెట్స్ తయారుచేస్తుంటారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులు ఇష్టమైన వంటకాలు సిద్ధం చేయండి. ఎప్పుడూ చేసేవి కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయండి.
‘క్రిస్మస్ ట్రీ’ని అలంకరించండి.
క్రిస్మస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ. ఈ అలంకారం ఓ ఆర్ట్. మీ క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి అందరి కన్నా భిన్నంగా క్రిస్మస్ ట్రీ అలంకరించండి. దానికింద కొన్ని బహుమతులు పెట్టి ఇంట్లో పిల్లలు ఉంటే వారికి, లేదంటే చుట్టుపక్కల కొందరు పిల్లలకు పంచండి. క్రిస్మస్ ట్రీ అలంకరణ వల్ల మీ క్రియేటివిటీ పెరగడమే కాదు చూసినవారూ ఆనందపడతారు.
Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!