Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
Merry Christmas 2023: డిసెంబరు 25న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రధానమైన, అందమైన, పురాతనమైన చర్చిలేంటో చూద్దాం
![Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి! Christmas Celebrations 2023 Most Beautiful and famous Churches In The World must visist Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/b1ecfc1faa696a3963b76cc25019c8031701433000134217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Most Beautiful and famous Churches : క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇంట్లో, స్థానికంగా ఉండే చర్చిలలో జరుపుకునేవారు కొందరైతే.. ఇతర ప్రాంతాలు, దేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకునేవారు ఇంకొందరు. ఇప్పటికే ఈ ప్రదేశాలు చూసివస్తే సరేకానీ..చూడకపోతే మాత్రం ఈ ఏడాది మిస్సవకండి. ఎందుకంటే ఆయా ప్రదేశాలకు అంత చరిత్ర ఉంది మరి..
బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి గోవా
ప్రపంచం నలుమూలల నుంచి క్రైస్తవ పర్యాటకులను ఆకర్షిస్తుంది బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి. గోవాలో ఉన్న ఈ చర్చి భారతదేశంలోని ప్రధాన చర్చిలలో ఒకటి. ఇది సుమారు 400 సంవత్సరాల నాటిది. ఇది క్రైస్తవ వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ. దీనితో పాటూ గోవాలో సే కేథడ్రల్, చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్, చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి సహా ఎన్నో పురాతన చర్చిలు సందర్శించవచ్చు.
Also Read: క్రిస్మస్ వేడుకలు డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!
సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి
సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి... భారతదేశంలోని మొదటి యూరోపియన్ చర్చి. 1503లో కొచ్చిలో నిర్మించారు. వాస్కోడిగామాను ఇక్కడే ఖననం చేశారని చెబుతారు
సెయింట్ లూక్స్ చర్చి కాశ్మీర్
ఈ చర్చి కాశ్మీర్‌లో శంకరాచార్య కొండ దిగువన ఉంది. ఈ చర్చి పునాది రాయిని డాక్టర్ ఎర్నెస్ట్ , డాక్టర్ ఆర్థర్ నెవ్ వేశారు. 12 సెప్టెంబర్ 1896న లాహోర్ బిషప్ దీనిని ప్రజలకు అంకితం చేశారు.
సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ ఢిల్లీ
దిల్లీలోని పురాతన చర్చిల్లో ఒకటి... కన్నాట్ ప్లేస్‌లోని కేథడ్రల్ ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్. భాయ్ వీర్ సింగ్ మార్గ్‌లో ఉంది. ఈ రోమన్ క్యాథలిక్ చర్చి 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇటలీకి చెందిన ఆర్కెటెక్ట్ హెన్రీ మేడ్ అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. చర్చి పైకప్పు, అందమైన తోరణాలు, లోపల డిజైన్లు చూపుతిప్పుకోనివ్వవు
Also Read: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!
క్రైస్ట్ చర్చ్ సిమ్లా
ఈ చర్చి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో ఉంది. ఇది ఉత్తర భారతదేశంలోని పురాతన చర్చిలలో ఒకటి. క్రైస్ట్ చర్చ్‌ను 1844లో కల్నల్ JT బోయిలే రూపొందించారు. దీని నిర్మాణం సుమారు 13 సంవత్సరాల తర్వాత 1857లో గోతిక్ కళలో ప్రారంభమైంది.
మెదక్ కేథడ్రల్
ఈ చర్చి తెలంగాణలోని మెదక్‌లో ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత అందమైన కేథడ్రల్ చర్చిలలో ఒకటిగా చెబుతారు. ఈ చర్చిని చార్లెస్ వాకర్ పాస్నెట్ నిర్మించారు.
Also Read: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !
ది అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్
ఈ చర్చి పనాజీలో ఉంది. దీనిని 1541లో ఒక చిన్న మందిరంలా నిర్మించారు. ఆ తర్వాత 1600-1609 మధ్య అందమైన ఆకృతిని పొందింది. ఈ చర్చిలో ప్రధాన మందిరం మేరీ మాతకు అంకితం చేశారు. ఇక్కడ సెయింట్ పీటర్, సెయింట్ పాల్ విగ్రహాలు ఉన్నాయి.
ఆల్ సెయింట్స్ కేథడ్రల్ చర్చ్
అలహాబాద్‌లోని ఈ రాతి చర్చిని 1870లో సర్ విలియం ఎమర్సన్ రూపొందించారు. దీన్ని నిర్మించడానికి 17 సంవత్సరాలు పట్టింది. 1887లో పూర్తైన ఈ చర్చి అందానికి ఉదాహరణగా చెబుతారు. దీని క్యాంపస్ కూడా చాలా పెద్దది. 40 అడుగుల వెడల్పు 130 అడుగుల పొడవుతో ప్రార్థనా మందిరం అద్భుతంగా ఉంటుంది.
Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023
సెయింట్ మేరీస్ బసిలికా బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న సెయింట్ మేరీస్ బసిలికా...నగరంలోని పురాతన చర్చిలలో ఒకటి. ఏటా ఇక్కడ జరిగే సెయింట్ మేరీస్ ఫెస్ట్‌కు ప్రసిద్ధి చెందింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)