Christmas 2023: క్రిస్మస్ వేడుకలు డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!
Merry Christmas 2023: డిసెంబరు 25న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. వేల ఏళ్లుగా ఈ పర్వదినం ఇదే రోజున ఎందుకు జరుపుకుంటారో తెలుసా
![Christmas 2023: క్రిస్మస్ వేడుకలు డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు! Christmas 2023 Origin Definition Traditions History and Facts abot marry Christmas importance of 25th December Christmas 2023: క్రిస్మస్ వేడుకలు డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/7eaba57beb96982c79ef59aace5d599e1701418114193217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Christmas Origin Definition Traditions History: కిస్మస్ అనే మాట క్రీస్తు-మాస్ అనే ఒక ఆచారం నుంచి వచ్చింది. ఏసు తమ కోసం మరణించి, పునరుద్ధానుడయ్యాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకు గుర్తుగా అందరూ కలిసి ద్రాక్ష రసం, రొట్టె తీసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని సమభోక్తం (కమ్మ్యూనియన్) అనే పేరుతో నిర్వహిస్తారు. సమభోక్తం సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయం ముందు తీసుకోవచ్చు. అందువల్ల దానిని అర్ధరాత్రి తీసుకునేవాళ్లు. క్రీస్తు..మాస్ క్రమంగా క్రిస్మస్‌గా మారింది.
క్రిస్మస్ or ఎక్స్ మస్ ఏమనాలి!
క్రిస్టియానిటీ అనే పదాన్ని 1100 సంవత్సరం సమయంలో క్సియానిటీ అని పలికేవారు. ఆ పదం ఆంగ్ల అక్షరం ఎక్స్‌తో మొదలవుతుంది. గ్రీక్ భాషలో ఎక్స్ అనే అక్షరాన్ని కై అని పలుకుతారు. దాంతో గ్రీకు భాషలో క్రైస్తు పదంలో మొదటి అక్షరం ఎక్స్‌తో ఉండేది. 1551లో క్రిస్మస్‌ని ఎక్స్ టేమాస్ అనేవారు. క్రమేపీ అదే ఎక్స్‌మస్‌గా రూపాంతరం చెందింది. వాడుకవరకూ వచ్చేసరికి ఎవరి వీలు వాళ్లది.
Also Read: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!
క్రిస్మస్ డిసెంబరు 25నే ఎందుకు
2 వేల సంవత్సరాల క్రితం రోమ్ ను పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత మంది ప్రజలున్నారో లెక్కించాడు. ఈ లెక్కలను ఈజీగా సేకరించేందుకు ప్రజలంతా ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ 25వ తేదీలోపు చేరుకోవాలని ఆదేశించాడు. అదే సమయంలో రోమన్ రాజ్యంలో నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజున మేరీకి గాబ్రియేల్ అనే దైవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావని చెప్పాడు. పుట్టే బిడ్డకు ఏసు అనే పేరు పెట్టాలని చెప్పింది. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ తర్వాత అచ్చం దేవదూత చెప్పినట్టుగానే మేరీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి జోసెఫ్ కలలో కనిపించిన దైవదూత ‘మేరీని విడిచిపెట్టకు.. ఆమె దేవుని వరంతో గర్భం దాల్చిందని.. ఆమెకు పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డ..ఆ బిడ్డ తనను నమ్మిన ప్రజలకు పాపాల నుంచి విముక్తి కల్పిస్తాడని చెప్పాడు. దైవదూత చెప్పిన తర్వాత మేరీని మేరీని ప్రేమతో ఆదరించాడు జోసెఫ్.
Also Read: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !
పశువులపాకలో ఆశ్రయం
రాజు ఆదేశం మేరకు జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమై బెత్లేహామ్ కు డిసెంబరు 25 లోపు వెళ్లినప్పటికీ వారికి ఉండటానికి ఎక్కడా చోటు దక్కలేదు. చివరికి ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తుండగా.. ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఓ వెలుగు రావడంతో గొర్రెల కాపరులంతా భయపడ్డారు. అప్పుడు దైవదూత ‘మీరు భయపడొద్దు.. ఓ శుభవార్తను చెప్పడానికి ఇక్కడికొచ్చాను ఈరోజు లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు అని చెప్పి ఆనవాళ్లు చెబుతాడు. పశువుల పాకలో పుట్టిన బిడ్డని చూసి దేవదూత చెప్పిన విషయాన్ని ఆ గొర్రెల కాపరులు అందరికీ చెబుతారు. అప్పుడు సమయం డిసెంబరు 24 అర్థరాత్రి. అప్పటి నుంచి డిసెంబర్ 25వ తేదీన క్రీస్తు జన్మదినంగా..క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)