అన్వేషించండి

December 2023 Monthly Horoscope : ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

December 2023 Horoscope : 2023 డిసెంబర్ నెలలో కుటుంబ జీవితం, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం ఏ రాశివారికి ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

December 2023 Monthly Horoscope : 2023 సంవత్సరంలో ఆఖరి నెలలో ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభాలే. ఈ నెలలో గ్రహాల సంచారం మీకు అనుకూల ఫలితాలనిస్తోంది...

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశి వారికి 2023 డిసెంబరు నెల అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. అనుకున్న పనులు టైమ్ కి పూర్తిచేస్తారు..మంచి ఫలితాలు పొందుతారు.  కుటుంబంతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో ఎరి పెళ్లి గురించి అయినా జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకుంటాయి. మిత్రులతో కొనసాగుతున్న విబేధాలు సమసిపోతాయి. ఆదాయానికి లోటుండదు..కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ లక్కీ నంబర్ 6, కలిసొచ్చే రంగు మరూన్.

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

డిసెంబరు నెల సింహరాశివారికి బావుంటుంది. సమస్యలు మబ్బులు వీడినట్టు వీడిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. నెలాఖరులో వివాద సూచనలున్నాయి జాగ్రత్త. ఈ నెల మీ అదృష్ట సంఖ్య 8. కలిసొచ్చే రంగు గ్రే. 

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

2023 ఆఖరి నెల కన్యారాశివారికి మంచి ఫలితాలే ఉన్నాయి.ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది కానీ నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యాపారం బాగానే సాగుతుంది..ధైర్యంగా ముందడుగు వేయండి. నెల మధ్యలో జరిగే ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనికి మీ కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నత స్థానం పొందొచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ నెలలో మీ అదృష్ట సంఖ్య 1, కలిసొచ్చే రంగు బ్రౌన్. 

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
 
తులారాశివారికి డిసెంబరు నెలలో గ్రహాల అనుగ్రహం బాగానే ఉంది. వృత్తి, వ్యాపారాలలో శుభ ఫలితాలున్నాయి. కుటుంబంసలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. తల్లిదండ్రులకు సమయం కేటాయిస్తారు. పిల్లల పురోగతి చూసి సంతోషిస్తారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బయటి ఆహారానికి దూరంగా ఉండడమే మంచిది. నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీ  అదృష్ట సంఖ్య 3, మీకు కలిసొచ్చే రంగు గులాబీ.

Also Read: ఈ రాశులవారు ఒత్తిడి తగ్గించుకోకుంటే కష్టమే, నవంబరు 29 రాశిఫలాలు

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

2023 సంవత్సరంలో చివరి నెల మీకు శుభ ఫలితాలను అందిస్తోంది. వృత్తిపరమైన రంగంలో కీర్తిని పొందవచ్చు..ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. మీ మాటతీరు స్నేహపూర్వక సంబంధాలను పెంచుతుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సోదరులతో సఖ్యత ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన పరిచయాలు కలిసొస్తాయి. మీ అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే రంగు నీలం. 

Also Read: దశమి, ఏకాదశి కాకుండా మిగిలిన తిథులు మంచివి కావా, ఏ తిథి ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలుసా!

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీన రాశివారికి డిసెంబర్ 2023 అనుకూల ఫలితాలున్నాయి. వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ప్రారంభించిన కొన్ని పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి కానీ ధైర్యంగా ఉండండి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బావుంటుంది. మంతిర్లు సహకారంలో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితం బావుంటుంది. పెళ్లి దిశగా ఆలోచించే ప్రేమికులకు శుభసమయం ఇది. మీ అదృష్ట సంఖ్య 6 , కలిసొచ్చే రంగు తెలుపు. 

మిగిలిన ఆరు రాశుల ఫలితాలు తెలుసుకునేేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి....

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Charani: శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Advertisement

వీడియోలు

Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Charani: శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
క్రూయిస్ కంట్రోల్‌తో Hero Xtreme 160R 2026 అవతార్‌ - లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లలో ప్రత్యక్షం
2026 Hero Xtreme 160R షోరూమ్‌లలోకి ముందే వచ్చేసింది - కొత్త ఫీచర్లు, కొత్త అటిట్యూడ్‌
US Shutdown: ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
Embed widget