వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం; భారీ నజరానా ప్రకటించిన ప్రభుత్వం
Sri Charani: క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో గ్రాండ్ వెల్క్‌మ్ లభించింది. ప్రభుత్వం ఆమెను గ్రాండ్‌గా సత్కరించింది.

Sri Charani: 2025 వరల్డ్‌కప్‌లో విజయం సాధించిన జట్టులో ఉంటూ కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లోకి గ్రాండ్ వెల్క్ం లభించింది. ఆమె ప్రతిభను మెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు క్రీడాకారులు ఛాంపియన్‌లుగా మారి దేశానికి ఖ్యాతిని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం, రెండున్నర కోట్ల నగదు ఇవ్వాలని నిర్ణయించారు.
#WATCH | Amaravati: Cricketer Shree Charani, who played as part of the World Cup-winning Indian Women's team, met Andhra Pradesh CM N Chandrababu Naidu and Minister Nara Lokesh at the CM's residence. Former Cricketer and ex-Captain Mithali Raj was also at the meeting.
— ANI (@ANI) November 7, 2025
(Video:… pic.twitter.com/0mAt2svUsr
ఉదయం గన్నవరం విమానాశ్రయంలో ఏసీఏ ఆధ్వర్యంలో శ్రీచరణికి ఘన ఘనస్వాగతం లభించింది. శ్రీచరణికి మహిళ మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యరాణి సాదరంగా ఆహ్వానించారు. ఆమెకు పుష్ఫగుచ్చం అందించి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు, ట్రేజరర్ దండమూడి శ్రీనివాస్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు అభినందనలు తెలిపారు.
#WATCH | Andhra Pradesh: Cricketer Shree Charani, who played as part of the World Cup-winning Indian Women's team, arrives in Vijayawada to a warm welcome by her family and fans. #ICCWomensWorldCup2025 pic.twitter.com/nbYe2MU3a1
— ANI (@ANI) November 7, 2025
ఉమెన్ వరల్డ్ కప్ విజయంలో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి కీలకపాత్ర పోషించటం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వ కారణమని ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమెకు స్వాగతం పలికేందుకు అభిమానులు కూడా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
గన్నవరం నుంచి శ్రీచరణిని ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు అత్తున్నతస్థాయిలో గౌరవం లభించింది. ఆమె ప్రతిభను చంద్రబాబు, లోకేష్ కితాబు ఇచ్చారు.

అనంతం మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఏ.సి. ఏ ఆధ్వర్యంలో శ్రీ చరణి మీడియా సమావేశం నిర్వహించారు. " ఏసీఏ నాకు అన్ని విధాలుగా తోడుగా నిలిచింది. ప్రభుత్వం గ్రూప్ 1 జాబ్ ఇస్తామని సీఎం చెప్పారు.2.5 కోట్ల నగదు , కడపలో స్థలం ఇస్తామని సీఎం చెప్పారు. మోడీతో సమావేశం జరిగినప్పుడు మరింత ముందుకు ఎలా వెళ్ళాలనే విషయం చెప్పారు." అని అన్నారు.

అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీచరణి. "నాకు కుటుంబం నుంచి చక్కటి ప్రోత్సాహం ఉంది.. మా మామ నన్ను క్రికెట్ ఆడిరచేవారు. నేను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో శిక్షణ పొందాను. ఇది మొదటి అడుగు మాత్రమే. ముందు చాలా ఉంది.
సీఎంను కలిసినప్పుడు చరణికి క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాలని చెప్పారని ఏసీఎ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ తెలిపారు. "ఏసీఏ తరపున అన్ని సదుపాయాలు ఆటగాళ్లకు కల్పిస్తున్నాం. చరణి పేరుని విశాఖ స్టేడియంలో ఒక వింగ్‌కు పేరు పెడుతాం. మహిళా క్రికెటర్ అకాడమి త్వరలో ప్రారంభిస్తాం. మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అవార్డ్స్ కూడా ఇస్తాం." అని ప్రకటించారు.





















