అన్వేషించండి
వృశ్చిక రాశిలో ప్రమాదకరమైన అంగారక యోగం, డిసెంబర్ 7 వరకు ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి!
Angarak Yog 2025: కుజుడు రాహువుతో కలియడం వల్ల వృశ్చిక రాశిలో అంగారక యోగం ఏర్పడింది. డిసెంబర్ 7, 2025 వరకు ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మీ రాశి ఉందా?
Angarak Yog 2025
1/7

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళుడి సంచారం 45 రోజుల్లో జరుగుతుంది. 2025 అక్టోబర్ 27న మంగళుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో మంగళుడు డిసెంబర్ 7 2025 వరకు ఉంటాడు. వృశ్చిక రాశిలో సంచరిస్తూ మంగళుడు మకర రాశిలో 11వ స్థానంలో ఉండి కుంభ రాశిపై దృష్టి సారిస్తున్నాడు.
2/7

కుంభ రాశిలో ప్రస్తుతం రాహువు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో కుంభ రాశిలో ఉన్న రాహువుతో మంగళుడు కలవటం వలన అంగారక యోగం ఏర్పడింది.
3/7

మంగళుడు .. రాహువు ఒకరికొకరు శత్రు గ్రహాలు. అందుకే ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ప్రమాదకరమైనదిగా భావిస్తారు. అంగారక యోగం కొన్ని రాశులలో దూకుడు, కోపం పెంచుతుంది, ఇది నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఈ రాశుల వారు డిసెంబర్ 7, 2025 వరకు జాగ్రత్తగా ఉండాలి.
4/7

కుజుడు కర్కాటక రాశి నుంచి 5వ స్థానంలో ఉండి మీ రాశిని 8వ స్థానంలో చూస్తున్నాడు . ఈ సమయంలో కర్కాటక రాశి వారు ధన నష్టాన్ని ఎదుర్కోవచ్చు. అలాగే మాటతీరు ప్రవర్తనను కూడా నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి
5/7

వృశ్చిక రాశిలో సంచరిస్తున్న మంగళుడు మీ 11వ స్థానంలో ఉండి నాల్గవ స్థానంపై దృష్టి సారిస్తున్నాడు. అందువల్ల మకర రాశి వారి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అంగారక యోగం అశుభత్వం వల్ల మీ పనులు చెడిపోవచ్చు.
6/7

మంగళ రాహువుల కలయికతో ఏర్పడిన అంగారక యోగం కుంభ రాశి వారికి సమస్యలను పెంచుతుంది. ఈ సమయంలో వాగ్వాదాల కారణంగా సంబంధాలలో దూరం ఏర్పడుతుంది. అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
7/7

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
Published at : 07 Nov 2025 10:52 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
క్రికెట్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















