అన్వేషించండి

December 2023 Monthly Horoscope : 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

December 2023 Horoscope : 2023 డిసెంబర్ నెలలో కుటుంబ జీవితం, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం ఏ రాశివారికి ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

December 2023 Monthly Horoscope : 2023 సంవత్సరంలో ఆఖరి నెలలో ఈ ఆరు రాశులవారికి మిశ్రమ ఫలితాలున్నాయి. గ్రహాల సంచారం కొన్ని విషయాలపై ముందస్తు హెచ్చరికలు చేస్తోంది.

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేష రాశివారికి ఈ నెల అనుకూల ఫలితాలున్నాయి. అన్ని రంగాలవారు రాణిస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. మీ తెలివితేటలతో ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ప్రవర్తనను అందరూ మెచ్చుకుంటారు, గౌరవం పెరుగుతుంది.  8వ స్థానంలో శుక్రసంచారం వల్ల స్త్రీలతో విరోధ సూచనలున్నాయి. చేపట్టిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది.  అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ అదృష్ట సంఖ్య 2, మీకు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ.

Also Read: దశమి, ఏకాదశి కాకుండా మిగిలిన తిథులు మంచివి కావా, ఏ తిథి ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలుసా!

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

వృషభ రాశివారికి ఈ నెలలో గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు. గృహంలో మార్పులొచ్చే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, వాహనాల రిపేర్లు , గాయాలపాలవడం జరగొచ్చు. ఏడాది చివర్లో ఆర్థిక నష్టం జరిగే సూచనలున్నాయి. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. డబ్బు భారీగా ఖర్చవుతుంది. అనూహ్య సంఘటనలు జరిగే అవకాశం ఉంది.  కుటుంబ జీవితం బాగానే ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి. మీ అదృష్ట సంఖ్య 4, కలిసొచ్చే రంగు ఆరెంజ్.

Also Read: ఈ రాశులవారు ఒత్తిడి తగ్గించుకోకుంటే కష్టమే, నవంబరు 29 రాశిఫలాలు

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ నెలలో మిథున రాశివారికి మిశ్రమఫలితాలుంటాయి. అనుకోని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కుటుంబంలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించడం మీకు కష్టమవుతుంది. విభేదాలు పెరిగేకొద్దీ పరిస్థితి విషమిస్తుంది..ముందే జాగ్రత్తపడడం మంచిది. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపించినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. పిల్లల భవిష్యత్తుపై కొంత ఆందోళన ఉంటుంది. ఆరోగ్య  బాగానే ఉంటుంది. చీటికి మాటికి కోప్పడతారు. విరోధాలు, మాటపట్టింపులు ఉంటాయి. ఈ నెల మీ అదృష్ట సంఖ్య 7 , కలిసొచ్చే రంగు స్కై బ్లూ .

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

డిసెంబరు నెలలో వృశ్చికరాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచిది. తల్లిదండ్రుల సమ్మతి తర్వాత ఏ నిర్ణయం అయినా తీసుకోవడం మంచిది. కొన్ని సమస్యలపై జీవిత భాగస్వామితో వివాదాలు జరగొచ్చు. కాస్త ఓపికగా వ్యవహరించండి. మీరు ఇతరులకు చెప్పలేని కొన్ని విషయాలు ఉండాలి..మీరు మానసికంగా కొంచెం అస్వస్థతతో ఉండవచ్చు. ఆరోగ్యం బావుటుంది. అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. విద్యార్థులకు శుభసమయం. మీ అదృష్ట సంఖ్య 6, కలిసొచ్చే రంగు పసుపు. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

2023 డిసెంబరు నెల ధనస్సు రాశివారికి అంతగా కలసిరాదు. జన్మంలో గ్రహసంచారం వల్ల చేసే వృత్తి వ్యాపారాలు కలసిరావు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ప్రతి విషయానికి అధికంగా కోప్పడతారు. వాహనప్రమాదం ఉంది జాగ్రత్త. నూతన అవకాశాలు వస్తాయి కానీ ఆలోచించి అడుగేయాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది.  పిల్లల విషయంలో సున్నితంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య  5, మీకు అనుకూలమైన రంగు నీలం.

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

డిసెంబరు నెలలో వ్యయంలో గ్రహసంచారం వల్ల అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యాపార వ్యవహారాలు పెద్దగా కలసిరావు. వాహనరిపేర్లు, కొన్ని వస్తువులు పోగొట్టుకోవడం జరగొచ్చు. కుటుంబ వాతావారణం బావుంటుంది కానీ బంధుమిత్రులతో విరోధ సూచనలున్నాయి. పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు కానీ మానసికంగా ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముడుతుంది. మిత్రద్రోహులున్నారు జాగ్రత్తగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 7 , కలిసొచ్చే రంగు నీలం. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
U19 Asia Cup 2025 IND vs PAK: భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు

వీడియోలు

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
U19 Asia Cup 2025 IND vs PAK: భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
భారత్‌కు 348 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్.. విజేతగా నిలవాలంటే రికార్డ్ ఛేజింగ్ తప్పదు
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
Nora Fatehi Car Accident: హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
Revolver Rita OTT : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
Embed widget