Importance of Tidhi in Astrology: దశమి, ఏకాదశి కాకుండా మిగిలిన తిథులు మంచివి కావా, ఏ తిథి ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలుసా!
Importance of Tidhi : ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు మంచి రోజు చూసుకుంటారు. దశమి, ఏకాదశి అనగానే ఇక ఆలోచనెందుకు అనుకుంటారు. ఆ రెండు తిథులు మినహా మిగిలిన తిథుల్లో ఏ పనీ ప్రారంభించకూడదా..
Importance of Tidhi in Astrology
- తిథులు పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకూ 16 తిథులు... 15 రోజులు
- నెల రోజుల్లో ఒక్కో తిథి రెండుసార్లు వస్తుంది..అమావాస్య, పౌర్ణమి నెలలో ఒక్కసారే వస్తాయి
- అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుంచి తెలుగు నెల మొదలైతే పదిహేను రోజులకు పౌర్ణమి వస్తుంది..
- పాడ్యమి నుంచి మొదలై 15 రోజులకు వచ్చే అమావాస్యతో తెలుగు నెల పూర్తవుతుంది
- పౌర్ణమి ముందు వచ్చే రోజులను శుక్లపక్షం అని..అమావాస్య ముందొచ్చే రోజులను కృష్ణపక్షం అంటారు
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
మంచి రోజు చూసుకునే అలవాటుందా!
కొన్ని పనులు కొత్తగా ప్రారంభించాలి అనుకున్నట్టు మంచి రోజు చూసుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఈ తిథి మంచిదా కాదా అని ఆలోచిస్తారు. పెద్ద పెద్ద కార్యక్రమాలకు అయితే పండితుల దగ్గరకు వెళ్లి ముహూర్తం పెట్టించుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న పనులకు మాత్రం కేవలం మంచి తిథి చూసుకుని ముందడుగు వేస్తారు. అలాంటప్పుడు కూడా అమావాస్య ముందు ఏదైనా పని చేయాలంటే ఆలోచిస్తారు...అమావాస్య మర్నాడు బలిపాడ్యమి అనే సెంటిమెంట్ మరికొందరికి ఉంటుంది. దశమి, ఏకాదశి తిథుల్లో ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తవుతుందని భావిస్తారు కానీ మిగిలిన తిథుల గురించి అంతగా పట్టించుకోరు. అయితే 16 తిథుల్లో కొన్ని మంచి ఫలితాలనిస్తే...మరికొన్ని తిథులు అశుభఫలితాలను ఇస్తాయంటారు పండితులు. అవేంటో చూద్దాం...
Also Read: ఈ రాశులవారు ఒత్తిడి తగ్గించుకోకుంటే కష్టమే, నవంబరు 29 రాశిఫలాలు
తిథులు - ఫలితాలు
- పాడ్యమి - మొదటి అర్థభాగం మంచిదికాదు..తర్వాత అర్థభాగం మంచిది
- విదియ - ఈ రోజు ఏ పని తలపెట్టినా శుభమే
- తదియ - ఈ రోజు చేసే పనుల్లో విజయం, ఆనందం కలుగుతాయి
- చవితి - చవితికి చల్లని తిథి అనే పేరు...ఈ తిథి అర్థభాగం గడిచిన తర్వాత మంచిది
- పంచమి - తిథి శుభానికి చిహ్నం, ఈ తిథిలో ఏం చేసినా లాభమే
- షష్టి - ఈ రోజు ఏ పని ప్రారంభించినా పెద్దగా కలసిరాదు..అందుకే ఈ రోజు ఏ పనీ కొత్తగా ప్రారంభించరు. అమృత ఘడియలు, తారాఫలం చూసుకుని ప్రారంభించినా ఏదో చిన్న అడ్డంకి మాత్రం తప్పదంటారు పండితులు
- సప్తమి -ఈ రోజు ఏం చేసిన కలిసొస్తుంది, అన్నింటా విజయం వరిస్తుంది. ముఖ్యంగా చదువులకు సప్తమి తిథి మంచిదంటారు. స్పష్టంగా చెప్పాలంటే ఇది విద్యార్థుల తిథి
- అష్టమి -ఈ తిథి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. ఇది కేవలం దుర్గాదేవికి మాత్రమే కలిసొచ్చే తిథి..ఈ రోజు ఏం చేసినా అష్టకష్టాలు తప్పవు
- నవమి -ఈ తిథి గురించి చెప్పుకునే ముందు శ్రీరాముడిని తలుచుకోండి..ఆయనకే తప్పలేదు మనమెంత..అందుకే నవమి రోజు కూడా కొత్తగా ఏ కార్యాలూ ప్రారంభించరు
- దశమి - పేరులోనే ఉంది దశ తిరుగుతుందని...ఈ రోజు ఏం చేసినా విజయమే
- ఏకాదశి - ఈ రోజు పది పనులు చేపడితే అందులో ఒకటి అవుతుందని చెబుతారు పండితులు
- ద్వాదశి - ఈ తిథి ప్రయాణాలకు మంచింది. అయితే ఖాళీ కడుపుతో బయలుదేరకుండా ఏదైనా తినేసి వెళితే తలపెట్టిన పనులు నెరవేరుతాయంటారు
- త్రయోదశి - ఈ రోజు ఏ పని చేసినా విజయం వరిస్తుంది
- చతుర్దశి - ఈ తిథిని పెద్దగా పట్టించుకోపోవడం మంచిది
- పౌర్ణమి - ఈ రోజు అన్నీ శుభాలే. ఈ రోజు వర్జ్యం లేకుండా ఉండే మరింత మంచిదని చెబుతారు పండితులు
- అమావాస్య - ఈ రోజు ఏ పనీ కొత్తగా చేయకపోవడమే మంచిది...అమావాస్య కలిసొచ్చేవారూ ఉన్నారు కానీ నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే
Also Read: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!
షష్టి –శనివారం, సప్తమి –శుక్రవారం, అష్టమి –గురువారం, నవమి – భుదవారం, దశమి –మంగళవారం, ఏకాదశి –సోమవారం, ద్వాదశి –ఆదివారం వచ్చినప్పుడు శుభకార్యాలు చేసుకోవచ్చంటారు. కొన్ని సార్లు..తిథి కన్నా తారాబలం కుదిరినప్పుడు కూడా కొత్త పనులు ప్రారంభిస్తారు. తారాబలం అంటే మీ నక్షత్రం నుంచి ఆ రోజు ఉన్న నక్షత్రం వరకూ కౌంట్ చేయాలి. వచ్చిన నంబర్ సరి సంఖ్య అయితే మంచిది..బేసి సంఖ్య అయితే మీకు కలసిరాదని అర్థం. మళ్లీ 9 నంబర్ వచ్చినా శుభమే.
నోట్: కొన్ని పుస్తకాలు, కొందరు పండితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply