Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!
Merry Christmas 2023: డిసెంబరు 25న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం....
Unique Christmas Traditions Around the World : క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ...చిన్న పిల్లలకు భలే ఇష్టం. అందుకే కుటుంబ సభ్యులు కొందరు శాంటాక్లాజ్ గా మారి సర్ ప్రైజ్ గిఫ్టులు ఇస్తుంటారు. కొందరైతే పేదలకు ఆహారం, బహుమతులు అందిస్తారు. అసలు క్రిస్మస్ అంటేనే ట్రీ, శాంటా క్లాజ్ . అందుకే ఈ పండుగకు రెండు మూడు వారాల ముందునుంచీ ఇంటిని అందంగా అలంకరించడం, ఆ చెట్టుకింద బహుమతులు పెట్టి ఇంట్లో వాళ్లని సర్ ప్రైజ్ చేయడం చేస్తుంటారు. అంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. కొంచెం స్పెషల్ గా జరుపుకోవాలనుకునే వారు రమ్ కేక్, హాట్ చాక్లెట్ మేకింగ్ చేస్తుంటారు. అయితే అలంకారం, కేక్, బహుమతులు ఇవన్నీ కామన్..కానీ కొన్ని దేశాల్లో వింత సంప్రదాయాలు ఫాలో అవుతుంటారు. అవేంటో తెలుసుకుందాం...
Also Read: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
స్లోవాకియా
స్లోవాకియాలో క్రిస్మస్ రోజున ఒక విచిత్ర సాంప్రదాయం అమలుచేస్తారు. పెళ్లి కానివారు క్రిస్మస్ రోజు గుమ్మానికి... అంటే ఇంటి ఎంట్రన్స్ కి వెనక్కు తిరిగి నిల్చుని చెప్పు తీసి విసురుతారు. ఆ చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడిందంటే త్వరలో పెళ్లవుతుందని విశ్వాసం
జపాన్
జపాన్ లో క్రిస్మస్ సందర్భంగా చికెన్ అమ్మకాలు మామూలు రోజులకన్నా పదిరెట్లు ఎక్కువగా ఉంటాయి. అంతటా ప్లం కేక్ సాంప్రదాయంగా ఉంటే జపాన్‌లో స్పాంజ్ కేక్ ఎక్కువ.. అయితే క్రిస్మస్ రోజు అమ్మకం కాని కేకులను ఆ తర్వాత రోజు ఎవ్వరూ కొనుగోలు చేయరు, ఇంట్లో ఉండిపోయినవి కూడా తినరు.
Also Read: క్రిస్మస్ వేడుకలు డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!
ఫిన్లాండ్
ఫిన్లాండ్‌లో క్రిస్మస్ ముందురోజు సాయంత్రం స్మశానాలకి వెళ్లి వారి ఆత్మీయులను తలచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ రోజు వంట చేసి అవన్నీ బల్లపై పెట్టేసి..మంచాలు సిద్ధం చేసి ఇంట్లో వాళ్లంతా నేలపై పడుకుంటారు. గతించిన వారు వచ్చి తినేసి పడుకునేందుకు వీలుగా అలా ఏర్పాట్లు చేస్తారట
స్వీడన్
స్వీడన్ వీధుల్లో భారీ మేక బొమ్మను నిలబెడతారు. క్రిస్మస్ ఈవ్ అర్ధరాత్రి ఆ మేకను కాల్చేస్తారు. ఈ సాంప్రదాయం 1966లో మొదలయ్యింది.
Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023
ఉక్రెయిన్
మామూలుగా అయితే క్రిస్మస్ ట్రీకి అందమైన దీపాలు, గంటలు, బొమ్మలు వేలాడదీస్తారు. కానీ ఉక్రెయిన్‌లో ఆ చెట్టుకు సాలెపురుగు గూళ్లను వేలాడదీస్తారు. దీని వెనుక స్థానికులు ఓ కథ చెబుతారు...ఒక నిరుపేద కుటుంబానికి క్రిస్మస్ చెట్టుని అలంకరించే స్థోమత లేదు. ఆ చెట్టుకి అప్పటికే సాలెగూళ్లు అల్లుకుని ఉన్నాయి. క్రిస్మస్ రోజు తొలి సూర్య కిరణం తగలగానే ఆ సాలెపోగులే బంగారం, వెండి పోగులుగా కనిపించి సంతోషాన్ని కలిగించాయట. అందుకే సాలెగూళ్లను వేలాడదీస్తారు
పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ రోజు సాంప్రదాయంగా 'టర్కీ' పక్షిని తింటారు
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
ఇంకా ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి.. కొన్ని కొన్ని దేశాల్లో వింత సంప్రదాయాలు. ఏవరు ఏం అనుసరించినా ప్రతి పండుగ ఉద్దేశం కుటుంబాల్లో, సమాజంలో సంతోషం నింపాలి. ఇరుగు-పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొనాలి. సాటివారిపై ప్రేమ, కరుణ చూపించాలనే...