అన్వేషించండి

Characteristics of Kaliyuga: 'నాస్తికో వేదనిందకః'- కలియుగంలో ఇంతేనా, సనాతనధర్మంపై వివాదం ఈ కోవకే చెందుతుందా!

కలియుగంలో..ధర్మం అంటే ఏంటి అనేట్టుంటుంది పరిస్థితి. ఏది నిషిద్ధం అని వేదాలు, పురాణాలు చెప్పాయో అవే పనులు చేయాలనే ఆసక్తి కలిగిఉంటారు. ప్రస్తుతం సనాతన ధర్మంపై జరుగుతున్న గొడవ కూడా ఈ కోవకే చెందుతుందా?

Characteristics of Kaliyuga:  సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అత్యధికులు స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తుంటే కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు. అయితే దీనిపై వేదపండితులు కూడా తమ అభిప్రాయాలను చెబుతూ కలిపురుషుడి లక్షణాలు, కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతున్నారు..అవేంటో చూద్దాం...

మొత్తం నాలుగు యుగాలు... సత్యయుగం, త్రేతాయుగం, ద్వారపయుగం, కలియుగం.

మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే..రెండో యుగంలో మూడు పాదాలపై..మూడో యుగంలో రెండు పాదాలపై నడిచింది. ప్రస్తుతం కలియుగంలో ధర్మ ఒంటికాలిపై కుంటుతూ నడుస్తోంది. ఈ యుగంలో కలిపురుషుడి పుట్టుకే ఆశ్చర్యంగా ఉంటుంది. క్రుద్దుడు అనే యువకుడు హింస అనే తోడబుట్టిన చెల్లెల్నే పెళ్లిచేసుకుంటాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది.అందుకే వేదం, ధర్మంపై కలిపురుషుడికి పెద్దగా శ్రద్ధ ఉండదు. అలాంటి వాడు పాలకుడైతే ప్రజలు ఎంత అధర్మంగా బతుకుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంటుంది. పరమేశ్వరుడు నిషిద్ద కర్మగా చెప్పాడో దానిపై ఆసక్తి చూపించేలా మనుషుల బుద్ధి మార్చేయడమే కలిపురుషుడి పని. 

Also Read: సెప్టెంబరు 08 రాశిఫలాలు, ఈ 2 రాశులవారికి ధనలాభం - ఆ రాశివారికి సంతోషం!

కలియుగంలో ఇలా ఉంటారు

కలియుగం ప్రారంభమవగానే  మనుషుల్లో పవిత్రత నశిస్తుంది. నిజం మాట్లాడటమే మహాపాపం అన్నట్టు భావిస్తారు. వేదాలను నిందిస్తూ, ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఇదే అద్భుతమైన జీవితం అంటూ బతికేస్తారు. కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే..

పరాపవాద నిరాః పరద్రవ్యాభిలాషిణః |
పరస్త్రీసక్త మనసః పరహింసా పరాయణాః ||

మొత్తం నాలుగు ’పర’లు ఉన్నాయి.  పరులపై నిందలు చేస్తూ, ఆ నిందలే కాలక్షేపంగా మార్చుకుంటారు..ఇంకా పరద్రవ్యాలమీద, పరస్త్రీలమీద అభిలాష కలిగి ఉంటారు. పరహింసా పరాయణులై ఉంటారు.

దేహాత్మ దృష్టయా మూఢా నాస్తికాః పశుబుద్ధయః !
మాతృపితృ కృత ద్వేషాః స్త్రీ దేవాః కామకింకరాః ||

సర్వపాపాలకూ మూలం దేహం. ఈ దేహాన్ని తృప్తిపరచడానికి సర్వపాపాలూ చేస్తారు. దేహానికి అతీతమైనది ధర్మం అని చెప్పినా చెవికి ఎక్కించుకోరు. దాంతో మూఢత్వం ఏర్పడి నాస్తికులుగా మారి తిరిగి ధర్మాన్ని నిందిస్తారు

“నాస్తికో వేదనిందకః” 

వేదనిందకులై శాస్త్రాలపై విశ్వాసం లేనివారై పశుబుద్ధులతో తల్లిదండ్రులపై ద్వేషబుద్ధి కలిగి ఉంటారు. కలియుగంలో స్త్రీలే దేవతలు. కామానికి తలొంచని పురుషుడు ఉండడు. ధనార్జనే ప్రధాన ధ్యేయం. వేదవిద్యలను, జ్ఞానాన్ని అమ్మకుంటారు. విద్యల ప్రయోజనం ధనమే అన్నట్టు మారిపోతుంది. జీవిత పరమార్థాన్ని చెప్పే విద్యలను కూడా సంపాదనకోసమే అన్నట్టు నేర్చుకుంటారు.

Also Read: వినాయ‌క చ‌వితి 18, 19 తేదీల్లో ఏ రోజు జ‌రుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!

త్యక్త స్వజాతి కర్మాణః ప్రాయశః పరవంచకాః |
త్రికాల సంధ్యయా హీనా బ్రహ్మబోధ వివర్జితాః ||

బ్రాహ్మణులు తాము చేయాల్సిన కర్మలు విడిచిపెట్టి ఇతరులను వంచిస్తూ తిరిగేస్తారు. త్రికాలసంధ్యావందనాలు వదిలేసి బ్రహ్మజ్ఞానం లేకుండా ఉంటారు.

అదయాః పండితం మన్యాస్స్వాచార వ్రతలోపకాః |
కృష్యుద్యమరతాః క్రూర స్వభావా మలినాశయాః ||

దయలేనివారు, ధర్మం తెలియనివారు పండితుల్లా కీర్తినందుకుంటారు..నిజమైన పండితులకు, వారి ఆచారాలకు, వ్రతాలకు భంగం కలిగిస్తుంటారు

క్షత్రియాశ్చ తథా సర్వే స్వధర్మ త్యాగశీలినః |
అసత్సంగాః పాపరతా వ్యభిచార పరాయణాః ||
అశూరా అరణ ప్రీతాః పలాయన పరాయణాః |
కుచౌర వృత్తయశ్శూద్రాః కామకింకరచేత సః ||

ఇక్కడ క్షత్రియులు అంటే పాలకులు. పాలించేవారంతా స్వధర్మాన్ని విడిచిపెట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారు. దొంగలే పాలకులవుతారు….పాలకులు దొంగల్లా ప్రవర్తిస్తారు. పదవి, అధికారం, సంపాదన తప్ప ..ధర్మాధర్మ విచక్షణ కోల్పోతారు. దేవుడికి సంబంధించిన ఆస్తులు కాజేస్తారు. హింసాపరులుగా మారుతారు. 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget