అన్వేషించండి

సెప్టెంబరు 08 రాశిఫలాలు, ఈ 2 రాశులవారికి ధనలాభం - ఆ రాశివారికి సంతోషం!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today (సెప్టెంబరు 07 రాశిఫలాలు)

మేష రాశి
ఈ రాశివారికి విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ఆకస్మిక ఆర్డర్లు పొందవచ్చు.  పిల్లలు చదువులో అద్భుతంగా రాణిస్తారు. నూతన ఉద్యోగంలో చేరాలి అనుకుంటే ఇదే మంచిసమయం. ఆలోచనల్లో స్థిరత్వం ఉండేలా చూసుకోవడం మంచిది.

వృషభ రాశి 
ఈ రాశివారు ఈ రోజు బిజీబిజీగా ఉంటారు. ఉద్యోగులుకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. కోపం తగ్గించుకోవాలి..మీ అభిప్రాయాలు ఎవ్వరిపైనా రుద్దేయవద్దు. కుటుంబ జీవితం బాగానే ఉంటుంది. ప్రేమికులకు ఇబ్బందులు ఎదురవుతాయి. 

మిథున రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. వ్యాపారంలో ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులు పురోగతి సాధించగలరు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తారు. 

Also Read: భగవద్గీతను పూజించాలా - అనుసరించాలా!

కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.  కొంత జాగ్రత్తగా ఉండాలి..ప్రమాద సూచనలున్నాయి. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. పాత అప్పులు తీర్చాలనే ఒత్తిడి మీపై ఉంటుంది. మీరు జనం మధ్యలో ఉండేందుకు ప్రయత్నించండి..ఒంటరిగా ఉండాలి అనుకోవద్దు.

సింహ రాశి 
మీరు మీ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో నగదు సమస్య తీరుతుంది. పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం పొందుతారు.

కన్యా రాశి
ఈ రాశివారు కొన్ని ప్రత్యేక పనులు పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సహకారం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

Also Read: కష్టంలో ఉన్నప్పుడు ఇవి చదువుకుంటే ఉపశమనం పొందుతారు

తులా రాశి
మీరు వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు.మీ మనసులో వికృతమైన ఆలోచనలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త పడండి. అపరిచితులను నమ్మొద్దు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు.

వృశ్చిక రాశి
ఈ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఉత్తమం. పిల్లల కెరీర్ విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. ప్రేమ సంబంధాలలో భావోద్వేగాలుంటాయి. వ్యక్తిగత సమస్యలను ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దు. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. 

ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. ప్రణాళికాబద్ధంగా అన్ని పనులు చేస్తే ప్రయోజనం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో చిక్కుకున్న డబ్బును తిరిగి పొందుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.

మకర రాశి
ఈ రాశివారు ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీ ప్రతిభ, సామర్థ్యం ప్రశంసలు అందుకుంటాయి. మీ వర్కింగ్ స్టైల్ మార్చుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ కలహాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లోని వ్యక్తుల బదిలీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారు ఏదో విషయంలో బాధగా ఉంటారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. బంధువులను ఎక్కువగా నమ్మకపోవడమే మంచిది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మీన రాశి  
ఈ రాశివారికి కార్యాలయంలో సీనియర్లతో విభేదాలు ఉండొచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పని ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ఆరోగ్యం బావుంటుంది.

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget