By: ABP Desam | Updated at : 30 Jul 2021 11:10 AM (IST)
గెలుపు కోసం చాణక్యుడు చెప్పిన ఫార్ములా
చరిత్ర పురుషుల్లో చాణక్యుడి స్థానం విశిష్టమైనది. అలాంటి వ్యక్తిని మళ్ళీ చరిత్ర చూడలేదు. బహుశా మళ్ళీ చూడటం సాధ్యం కాదేమో. రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేయగల ప్రజ్ఞ చాణక్యుడి సొంతం. తనను ఘోరంగా అవమానించిన నందరాజుల్ని అణగ దొక్కి, సామాన్యుడిగా బతుకుతున్న చంద్రగుప్తుణ్ని రాజుగా చేసిన ఘనత చాణక్యుడిది. వ్యతిరేక పరిస్థితుల్లోనూ చతురతతో లక్ష్యాన్ని సాధించడమే చాణక్యనీతి సూత్రం. కొన్ని సందర్భాల్లో విజయం కోసం అడ్డదారిలో వెళ్లినా తప్పులేదంటాడు చాణక్యుడు. కానీ ఎంచుకున్న మార్గం ద్వారా ఇతరులకు ఎలాంటి హాని కలగకూడదని స్పష్టం చేశాడు. అయితే అడ్డదారిలో అన్నమాటకి కండిషన్స్ అప్లై అవుతాయి అంటాడు చాణక్యుడు....అవేంటంటే...
అవేంటంటే..
1. మీరు చూసే, మాట్లాడే, వినే పద్ధతి, ధోరణి అందరిలా కాకుండా వ్యత్యాసంగా వుండాలి. అప్పుడే గెలుపు సాధ్యం. ఒక విషయాన్ని గ్రహించడంలో, దాని గురించి మాట్లాడటంతో, ఆ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆలోచించే ధోరణి వ్యత్యాసంగా వుండాలి.
2. ఇతరుల సంతోషం కోసం ఎగబడకూడదు. ఎందుకంటే ఇతరుల సంతోషం కోసం బతికే వారిని ఈ లోకం పక్కనబెట్టేస్తుందనే విషయాన్ని గుర్తించాలి.
3. ధనానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి. ధనం లేకపోయినా ఉన్నట్లు ఓ మాయను సృష్టించాలి. అలా చేస్తే.. ఈ ప్రపంచం ఆస్తి, ధనం ఉన్నవారిని గుర్తించేలా మీకూ గౌరవం లభిస్తుంది. ధనం లేకపోయినా ఆ విషయాన్ని దాచిపెట్టాలి.
4. విజయానికి సమ దూరం పాటించాలి. అదెలా అంటే...నిప్పులకు చాలా దగ్గరకు వెళ్లినా అది దహిస్తుంది. దూరంగా ఉంటే ఆహారాన్ని వండలేం. కానీ సమానమైన దూరంలో వుంటే రుచికరమైన వంట సిద్ధమవుతుంది. అందుకే గెలుపు మూలాధారానికి సమానమైన దూరంలో వుండాలి.
5. తాను కోల్పోయిన ఆస్తిని తలుచుకుని ఆవేదన చెందకూడదు. గతాన్ని గుర్తుచేసుకుని బాధపడరాదు. గతాన్ని గుర్తుచేసుకుని బాధపడటం బలహీనులు చేసేపని అని చాణక్య నీతి చెప్తోంది. గతంలో జరిగిన వ్యవహారాలతో అనుభవం పొందాలే కానీ.. బాధపడకూడదు.
6. ఎవరైనా ఒకరు ధర్మానికి విరుద్ధంగా ధనార్జన చేసినట్లైతే అలాంటి వ్యక్తులతో స్నేహం చేయరాదు.
7. ఏపని మొదలెట్టినా మూడు ప్రశ్నలు వేసుకోవాలి. 1. నేనేం చేయాలి. 2. చేసే పనికి ప్రతిఫలం ఏమిటి? 3. నేను చేసే కార్యానికి విలువెంత? వీటికి సమాధానమే మీ పనికి ఆధారం అవుతుంది.
8. ఆపదను ఎదుర్కొనే సత్తా ఉండాలి కానీ... వెనుకంజ వేయకూడదు. ముఖ్యంగా బలహీనత, కష్టం ఎప్పటికీ ముఖంలో కనిపించనివ్వకూడదు.
9. చేసే పనివిషయంలో ప్రశంసల కోసం పాకులాడకూడదు. పనిపై శ్రద్ధ, దృష్టి పెడితే గెలుపు తనంతట అదే మిమ్మల్ని వరిస్తుందని చాణక్య నీతి చెప్తోంది.
10. బలహీనులను చులకనగా చూడకూడదు. వారిని అంత సులభంగా తీసిపారేయకూడదు. శత్రువులు బలహీనులైతే.. అది మీకు చాలా ప్రమాదం. వారు మీతో పోటీపడలేరు. కాబట్టి మీకు తెలియకుండానే మిమ్మల్ని పడగొట్టే సత్తా వారికి ఉంటుందని గమనించాలి. స్నేహితులే కాకుండా శత్రువులకు సన్నిహితంగా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నారు.
Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి
Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్గా నిఖత్ జరీన్!