Chanakya Neeti In Telugu: ఈ సందర్భాల్లో స్త్రీ, పురుషుడు మళ్లీ పెళ్లిచేసుకోవచ్చన్న చాణక్యుడు
నోట్: అప్పటి పరిస్థితుల ఆధారంగా వివాహవ్యవస్థకు సంబంధించి చాణక్యుడు చెప్పిన విషయాలవి..
Chanakya Neeti In Telugu: పునర్వివాహం గురించి తన నీతిశాస్త్రంలో ప్రస్తావించిన చాణక్యుడు..అప్పటి పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో మళ్లీ పెళ్లిచేసుకోవచ్చని సూచించాడు. కేవలం పురుషుడికి మాత్రమే కాదు..స్త్రీకి కూడా కొన్ని సందర్భాల్లో పునర్వివాహం చేసుకునే హక్కు ఉంటుందని సూచించాడు... ఏఏ సందర్భాల్లో స్త్రీ, పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చో చెప్పాడు...
Also Read: నిజాయితీ కూడా మిమ్మల్ని ముంచేస్తుందని తెలుసా!
ఇలాంటి సందర్భాల్లో పురుషుడు మళ్లీ పెళ్లిచేసుకోవచ్చు
- కుటుంబ వ్యవస్థ గురించి చెప్పిన చాణక్యుడు...పునర్వివాహం గురించి కూడా కొన్ని సూచనలు చేశాడు
- స్త్రీ,పురుషులు ఏఏ సందర్భాల్లో మళ్లీ పెళ్లిచేసుకోవచ్చో తన నీతిశాస్త్రంలో వివరించాడు
- భార్య పిల్లలను కనలేనిది( గొడ్రాలు) అయినప్పుడు..చాణక్య నీతిశాస్త్రం ప్రకారం ఆ పురుషుడు మళ్లీ పెళ్లిచేసుకోవచ్చు
- స్త్రీ పిల్లల్ని కన్నప్పటికీ వంశోద్ధారకుడిని ఇవ్వలేనప్పుడు కూడా పురుషుడు మరో పెళ్లిచేసుకోవచ్చన్నాడు చాణక్యుడు
- ఎప్పటికప్పుడు గర్భవిచ్ఛితి జరుగుతున్నప్పుడు పరుషుడు తన వంశం కోసం మరో స్త్రీని వివాహం చేసుకోవచ్చు
- అయితే పెళ్లైన 8ఏళ్ల వరకూ భార్యలో పైన పేర్కొన్న సమస్యలున్నప్పటికీ మరో వివాహం చేసుకోరాదు..
- ఆ తర్వాత మళ్లీ పెళ్లిచేసుకోవాల్సి వస్తే.. మొదటిభార్యకు భరణంతో పాటూ పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది
Also Read: ఈ ముగ్గురు వ్యక్తులతో అతి చనువు అత్యంత ప్రమాదకరం
ఈ సందర్భాల్లో స్త్రీ మళ్లీ పెళ్లిచేసుకోవచ్చు
- పురుషుడికి మాత్రమే కాదు స్త్రీకి కూడా పునర్వివాహం చేసుకునే అవకాశం ఉందన్నాడు చాణక్యుడు
- భర్తకు మరో స్త్రీతో అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఆ మహిళ మళ్లీ పెళ్లిచేసుకోవచ్చు
- భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి విదేశాల్లో ఏళ్ల తరబడి ఉండిపోయినప్పుడు
- భర్త రాజద్రోహి అయినప్పుడు ఆ భార్య మళ్లీ పెళ్లిచేసుకోవచ్చు
- భార్యను చంపుదామని చూస్తున్నప్పుడు తన నుంచి తప్పించుకుని వెళ్లిపోయి మళ్లీ పెళ్లిచేసుకోవచ్చు
- సమాజం నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తిని వదిలేసి ఆ భార్య మరో పెళ్లి చేసుకోవచ్చు
- భర్త నపుంసకుడు అయినప్పుడు..భార్య తనకు తానుగా వదిలేయవచ్చు
- కొన్ని సందర్భాల్లో భార్య..భర్త అనుమతి లేకుండా కొన్ని ప్రదేశాలకు వెళ్లొచ్చు. అలాంటప్పుడు పరుష పదాలు వాడడం సరికాదు
- దగ్గరివారు చనిపోయినప్పుడు, తీవ్ర వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు,దగ్గరి వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భర్తకు చెప్పకుండా వెళ్లొచ్చు
- భార్యను భర్త ఇంట్లోంచి గెంటేసినప్పుడు ఆమె..భర్త బంధువుల ఇంట్లో కానీ, గ్రామపెద్ద ఇంట్లోకానీ, స్త్రీ సన్యాసులున్న ఆశ్రమంలో కానీ తలదాచుకోవచ్చు...
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి