అన్వేషించండి

Telangana: మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?

Telangana: మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం ఎందుకు తిరుగుతోంది? బీఆర్ఎస్‌కు సన్నిహితుడిగా పేరు పడిన ఆయనపై ఎందుకు కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు?

Why is Telangana politics revolving around Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా  బడా కాంట్రాక్టులు ఆయన కంపెనీలే చేస్తూంటాయి. తెలంగాణలో కాళేశ్వరం అయినా.. ఏపీలో పోలవరం అయినా మేఘా ఇంజినీరింగే కాంట్రాక్టర్. ఇవి అతి భారీ ప్రాజెక్టులు. కింది స్థాయి వరకూ కొన్ని వేల కాంట్రాక్టులు ఆయన సంస్థకు దక్కి ఉంటాయి. ఇలా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ ఒలెక్ట్రాకు చెందినవి. ఇది మేఘా గ్రూప్ కంపెనీనే. ఇంకా అనేక విభాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వారికి ప్రతీపాత్రుడు. 

బీఆర్ఎస్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు !

తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎన్నో కాంట్రాక్టులు చేపట్టింది. ఇంకా చెప్పాలంటే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పనులన్నీ మేఘా కంపెనీకే దక్కాయి. కాళేశ్వరం లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టు. ఇందులో సింహ భాగం మేఘా కంపెనీనే చేసింది. ఇతర ప్రాజెక్టులు కూడా ఆ సంస్థకే దక్కాయి. బాగా పని చేస్తున్నారని ఓ సారి కేసీఆర్ సన్మానం కూడా చేశారు. అందుకే విపక్ష నేతలు చాలా సార్లు మేఘా కంపెనీకి తెలంగాణను దోచి పెడుతున్నారని ఆంధ్రా కాంట్రాక్టర్ కు దాసోహం అయ్యారని ఆరోపించేవారు. మేఘాను ఈస్టిండియా కంపెనీగా పేర్కొనేవారు.    

'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు రెండు వందల కోట్లకుపైగా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన మేఘా 

మేఘా కంపెనీ బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లలో మేఘాతో పాటు అనుబంధ కంపెనీలు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన పార్టీల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బీజేపీ ఉంది. బీజేపీ విషయం పక్కన పెడితే.. ఓ ప్రాంతీయ పార్టీకి.. భారీగా కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీ రూ. రెండు వందల కోట్ల వరకూ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇవ్వడం విమర్శలకు దారితీసేదే. అది బీఆర్ఎస్ పార్టీతో మేఘా ఇంజినీరింగ్ యజమానులకు ఉన్న సాన్నహిత్యం అనుకోవచ్చు. 

Also Read: KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన కంపెనీపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటో స్పష్టంగా తెలియదు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లో చేపడుతున్న ఓ ప్రాజెక్టును మేఘా, రాఘవ సంస్థలు కలిసి చేజిక్కిచుకున్నాయి. ఈ రాఘవ సంస్థ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. తర్వాత హైదరాబాద్‌కు నీరందరించేలా చేపడుతున్న గోదావరి ఫేజ్ టు, మూసి ప్రాజెక్టులపై ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. అసలు టెండర్లే పిలవలేదు. అయినప్పటికీ ఆ సంస్థకే టెండర్లు ఇస్తారని తాము వచ్చాక సంతకాలు చేసిన అధికారుల్ని జైలుకు పంపుతామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేఘా కృష్ణారెడ్డి కూడా ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు.  ఒక వేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన హవా కొనసాగేది. బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసేవారు కాదు. మొత్తంగా చూస్తే మేఘా కృష్ణారెడ్డి ఎవరు అధికారంలో ఉంటే వారికి సన్నిహితమయ్యే ట్రిక్స్ అన్ని బాగా వంటబట్టించుకున్నారన్న సెటైర్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget