అన్వేషించండి

TRS MP On KA Paul : ఛీ ఛీ పాల్ ను మేం టార్గెట్ చెయ్యడమేంటి ?

కే ఏ పాల్‌ను తాము టార్గెట్ చేయడం లేదని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేఏ పాల్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం వింతగా ఉందన్నారు.


తెలంగాణ రాజకీయాల్లో కేఏ పాల్ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఆయన రైతులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు దాడి చేశారు. ఆ ఘటన తర్వాత కేఏ పాల్ మరింత దూకుడుగా టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. తనపై జరిగిన దాడి .. తెలంగాణలో అవినీతిపై ఆయన నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కేఏ పాల్‌కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం... తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్ని కూడా ఆశ్చర్య పరిచింది. వివిధ సమస్యలపై ఢిల్లీ వెళ్లిన తమ నేతలకు ఒక్క సారి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడాన్ని గుర్తు తెచ్చుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోక్ సభ స్థానాలు గెలుస్తాం, అమిత్ షాతో కేఏ పాల్

టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేఏ పాల్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇలా వింతగా ఉందన్నారు. పాల్‌కు ఇచ్చినట్లుగా తమకూ షా అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆయన కోరారు.  అమిత్ షాను కలిసిన తర్వాత కేఏ పాల్ చేసిన విమర్శలపైనా స్పందించారు. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందని అమిత్ షాకు చెప్పానని కేఏ పాల్ ప్రకటించారు. అయితే ఆయన చెప్పే వరకూ అమిత్ షాకు తెలియదా అని రంజిత్ రెడ్డి లైట్ తీసుకున్నారు. 

అమిత్ షాకు డిఫరెంట్ గా స్వాగతం పలుకుతున్న మంత్రి సబితా రెడ్డి, ఏం ఇవ్వలేదో చెప్పడానికి వస్తున్నారని సెటైర్లు
 

ప్రజలే ఎన్నుకుంటే.. మీకెందుకు బాధ.. బీజేపీ, కాంగ్రెస్ లో కుటుంబ పాలన లేదా.. అని రంజిత్ రెడ్డి ప్రశఅనించారు.  అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అంటున్నారు.. అప్పులు చేసి.. కేసీఅర్ ఇంటికి తీసుకుపోయినట్లు ఆరోపణలు చేస్తున్నారని.. తెలంగాణాలో అత్యధిక వృద్ధిరేటు ఉందని గుర్తు చేశారు. కె.ఏ పాల్ కు అమిత్ షా  అపాయింట్మెంట్ ఇవ్వడం..
చూడ్డానికి చాలా వింతగా అనిపిస్తోందన్నారు. 

48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు - బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీస్!

కేఏ పాల్‌ను టార్గెట్ చేయడం లేదని రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు.  పాల్ ను మేం టార్గెట్ చెయ్యడమేంటి అని ప్రశ్నించారు.  పాల్ ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదని రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణలో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్న కేఏ పాల్ తన పలుకుబడితో కేంద్ర పెద్దలను కలిసి తెలంగాణ పాలకులపై ఫిర్యాదు చేస్తున్నారు. తనపై జరిగిన దాడినే ఆయన హైలెట్ చేస్తున్నారు. ఆయనకు నేరుగా హోంమంత్రి అపాయింట్‌మెంట్ టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశమవుతోంది. పాల్ రచ్చ వెనుక బీజేపీ ఉందా అని అనుమానిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP SEC Anil Chandra Punetha: ఎస్ఈసీ బిగ్ అప్‌డేట్ - 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీల్లో 72 వార్డుల్లో నామినేషన్ల గడువు పొడిగింపు !
ఎస్ఈసీ బిగ్ అప్‌డేట్ - 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీల్లో 72 వార్డుల్లో నామినేషన్ల గడువు పొడిగింపు !
AP Municipal Elections Postponed: నవంబర్ 1న ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - నామినేషన్లపై నిర్ణయం పెండింగ్ !
నవంబర్ 1న ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - నామినేషన్లపై నిర్ణయం పెండింగ్ !
AP SEC Local Body Elections: నామినేషన్ల పొడిగింపుపై ఎస్ఈసీ నిర్ణయం ఏమిటి ? - కలెక్టర్ల నివేదికలతో కుస్తీ - నూతన షెడ్యూల్‌పై సస్పెన్స్!
నామినేషన్ల పొడిగింపుపై ఎస్ఈసీ నిర్ణయం ఏమిటి ? - కలెక్టర్ల నివేదికలతో కుస్తీ - నూతన షెడ్యూల్‌పై సస్పెన్స్!
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget