అన్వేషించండి

TVK Chief Vijay: తమిళనాడులో విజయ్‌కు మరో షాక్‌! భద్రత, కాన్వాయ్‌ వెనక్కి! ప్రమాణ స్వీకారం లేనట్టే!

TVK Vijay: తమిళనాడులో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీవీకే అధినేత విజయ్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ అంగీకరించకలేదు. ఇప్పుడు భద్రత, కాన్వాయ్‌ను వెనక్కి తీసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తమిళనాడులో టీవీకే 107 సీట్లు గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.
  • మెజారిటీకి 118 ఎమ్మెల్యేల మద్దతు అవసరం, కాంగ్రెస్ మాత్రమే మద్దతు ఇచ్చింది.
  • గవర్నర్ మెజారిటీ నిరూపించుకునే వరకు ప్రమాణస్వీకారం నిరాకరించారు.
  • అన్నాడీఎంకే తన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించి, టీవీకేకు మద్దతుపై విభేదాలున్నాయి.

TVK Chief Vijay: తమిళనాడులో అసలైన రాజకీయం అంటే ఏంటో టీవీకే అధినేత విజయ్ చూస్తున్నారు. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు ఆయనకు చిక్కుల్లో పడేసింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ ఇంకా ఆరుగురు కావాల్సి ఉంది. వారి కోసం ఆయా పార్టీలతో టీవీకే సంప్రదింపులు జరుపుతోంది. ఇంతలో ప్రమాణస్వీకార ప్రక్రియ పూర్తి చేయాలనే ఆయన ఆలోచనపై ఆదిలోనే గవర్నర్‌ నీళ్లు చల్లారు. పూర్తి మెజారిటీ నిరూపించుకునే వరకు ప్రమాణస్వీకారం లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఆయనకు కేటాయించిన భద్రత, కాన్వాయ్‌ను అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఎక్కువ సీట్లు సాధించినందుకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేస్తారని ఫలితాలు వచ్చిన రోజునే విజయ్‌కు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి కాన్వాయ్‌ను కేటాయించారు. అయితే ఇప్పుడు ఆ దిశగా ముందడుగు పడకపోవడంతో భద్రతను వెనక్కి తీసుకున్నారు. దీంతో తనకు కేటాయించిన కాన్వాయ్‌ను కూడా విజయ్ వెనక్కి ఇచ్చేశారు.  

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ సరైన మెజారిటీని ఇవ్వలేదు. విజయ్‌ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. అయితే అందులో రెండు స్థానాలు విజయ్‌వి కావడంతో ఓవరాల్‌గా సీట్లు సంఖ్య 107గా ఉంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. ఆ మద్దతు లేనందున విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. దీని కోసం అన్ని పార్టీల మద్దతును అడుగుతున్నారు. ఐదు సీట్లు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది. అయినా మ్యాజిక్ ఫిగర్‌ సాధించలేకపోయారు. ఇప్పుడు మిగతా పార్టీలు వచ్చేందుకు అంగీకరించడం లేదు.

Also Read: సుస్థిర ప్రభుత్వం విజయ్‌కు అసలు సవాల్ - అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే స్ట్రాటజీ ఫాలో అవుతారా?

ఏదోలా ప్రమాణస్వీకారం చేసి తర్వాత పార్టీల మద్దతు, కలిసి వచ్చే ఎమ్మెల్యేలతో మ్యాజిక్ ఫిగర్ సాధించి బల నిరూపణ చేసుకుందామని విజయ్ అనుకున్నారు. కానీ ప్రమాణస్వీకారానికి గవర్నర్‌ అంగీకరించడం లేదు. ముందు మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకొని రావాలని సూచించారు. మంచి ముహూర్తం ఉందని ఇవాళ ప్రమాణస్వీకార మహోత్సవం చేద్దామని అనుకున్నారు. కానీ ఇది వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పుడు కలిసి వచ్చే వారితో విజయ్ చర్చలు జరుపుతున్నారు. 

Also Read: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే చిక్కుల్లో టీవీకే అధినేత విజయ్‌! ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టులో పిటిషన్!

ఎమ్మెల్యేలు జారిపోతారేమో అన్న భయంతో అన్నాడీఎంకే తన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించింది. టీవీకేకు మద్దతు ఇవ్వడంపై ఇప్పటికే విభేదాలు తలెత్తాయి. అందుకే టీవీకేకు అనుకూలంగా మాట్లాడిన 27 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరి పంపించారు. వీళ్లకు సీవీకే షణ్ముగం నేతృత్వం వహిస్తున్నారు. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారిని అసెంబ్లీకి రప్పించే అవకాశం ఉంది. 

Also Read: ఒకరు నడిరోడ్డుపై తాగుతూ చిందులేశారు - మరొకరు తల్వార్‌తో కేక్ కట్ చేశారు - అప్పుడే టీవీకే ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం

చిన్న చితక పార్టీలను విజయ్ సంప్రదిస్తున్నప్పటికీ వారంతా కలిసి బలం 118కి చేరుకుంటుంది. ఈ సంఖ్యతో ఏం స్టేబుల్ ప్రభుత్వం ఏలా ఏర్పాటు చేస్తారో అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఇప్పుడే పాలనా అనుభవం, రాజకీయ అనుభవం లేని విజయ్‌కు పార్టీలు మూడుచెరువుల నీళ్ల తాగిస్తున్నాయి. ఒకవేల అరకొర మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తను అనుకున్నట్టు పాలన సాగించడం అంత ఈజీయేనా అన్న చర్చ మొదలైంది. ఇలాంటి ప్రభుత్వానికి దినదిన గండం నూరేళ్లు ఆయుస్సులా ఉంటుందని అంటున్నారు. 

Frequently Asked Questions

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఎన్ని సీట్లు గెలుచుకుంది?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. అయితే, విజయ్ రెండు స్థానాల్లో గెలవడంతో మొత్తం సీట్ల సంఖ్య 107గా ఉంది.

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ని ఎమ్మెల్యేల మద్దతు అవసరం?

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. విజయ్‌కి ప్రస్తుతం ఆ సంఖ్య లేదు.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే ఎవరి మద్దతు కోరుతోంది?

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర చిన్న పార్టీల మద్దతును కోరుతోంది. అయితే, మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది.

గవర్నర్‌ ప్రమాణ స్వీకారంపై ఎందుకు అంగీకరించలేదు?

పూర్తి మెజారిటీ నిరూపించుకునే వరకు ప్రమాణ స్వీకారం లేదని గవర్నర్‌ తేల్చి చెప్పారు. ముందు మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుని రావాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget