అన్వేషించండి

Vijay Strategy: సుస్థిర ప్రభుత్వం విజయ్‌కు అసలు సవాల్ - అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే స్ట్రాటజీ ఫాలో అవుతారా?

Tamilnadu: విజయ్‌కు మెజారిటీ మార్కు 118 అందుకోవడానికి కాంగ్రెస్ఐ దుగురు ఎమ్మెల్యేల మద్దతు సరిపోవడం లేదు. ఈ అనిశ్చితిని తొలగించి సుస్థిరమైన పాలన అందించాలంటే విజయ్ ముందు కొన్ని కీలక అవకాశాలు ఉన్నాయి.

Vijay stable government strategy:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకొచ్చాయి. అయితే ఆ మార్పు హంగ్ గా మారింది.  విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం  ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రస్తుతం తీవ్రమైన సందిగ్ధతను ఎదుర్కొంటోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు, మెజారిటీ మార్కు 118  అందుకోవడానికి కాంగ్రెస్ అందించిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు సరిపోవడం లేదు. ఈ అనిశ్చితిని తొలగించి సుస్థిరమైన పాలన అందించాలంటే విజయ్ ముందు కొన్ని కీలక అవకాశాలు ఉన్నాయి. 

అనిశ్చిత మెజారిటీ - అస్థిర పాలన ముప్పు 

ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్న సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా ఉంది. ఒకవేళ చిన్న పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినా, అది నూలుపోగు మీద నడిచే ప్రభుత్వంలా మారుతుంది. ఏ ఒక్క ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నా లేదా విపక్షాల ప్రలోభాలకు లోనైనా ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇటువంటి బలహీనమైన ప్రభుత్వంతో విజయ్ తన భారీ సంక్షేమ హామీలను అమలు చేయడం అసాధ్యం. 

అన్నాడీఎంకేతో సంకీర్ణం - ఏకైక సుస్థిర మార్గం 

విజయ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలబడాలంటే అన్నాడీఎంకే  తో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమ మార్గమని చర్చ జరుగుతోంది. 47 స్థానాలు కలిగిన అన్నాడీఎంకే గనుక ప్రభుత్వంలో భాగస్వామి అయితే, టీవీకే కూటమి బలం 160కి చేరుకుంటుంది. అయితే, దీనికి అన్నాడీఎంకే తన మిత్రపక్షమైన బీజేపీని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నాడీఎంకేలోని ఒక వర్గం విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నందున పళనిస్వామితో విజయ్ జరిపే చర్చలే కీలకం కానున్నాయి.

ఆపరేషన్ ఆకర్ష్' - ఫిరాయింపుల వ్యూహం 

ఒకవేళ అన్నాడీఎంకే అధికారికంగా మద్దతు ఇవ్వకపోతే, విజయ్ ఆ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలపై దృష్టి సారించే అవకాశం ఉంది. అన్నాడీఎంకేకు ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో మూడింట రెండొంతుల మందిని, అంటే సుమారు 31 మందిని విలీనం చేసుకుంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడదు. ఇప్పటికే సి.వి. షణ్ముగం కార్యాలయంలో 35 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం ఈ  ఆపరేషన్ ఆకర్ష్  దిశగా అడుగులు పడుతున్నాయని సూచిస్తోంది.

 రాజీనామాలతో నైతిక బలం 

విలీనం సాధ్యం కాకపోతే, కనీసం 15 నుండి 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఆ తర్వాత వారిని టీవీకే గుర్తుపై ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడం మరో మార్గం. ఇది రాజ్యాంగబద్ధంగా,  నైతికంగా విజయ్‌కు మంచి పేరు తెస్తుంది. తద్వారా అసెంబ్లీలో తన పార్టీ సొంత బలాన్ని పెంచుకోవడంతో పాటు, ప్రతిపక్షాల బలాన్ని తగ్గించవచ్చు. ఈ వ్యూహం ద్వారా మాత్రమే విజయ్ మైనారిటీ ప్రభుత్వం అనే ముద్రను చెరిపేసుకోగలరు.

ద్రావిడ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు 

విజయ్ పాగా వేయకుండా అడ్డుకోవడానికి అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే హైకమాండ్లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే తన మిత్రపక్షాలైన వామపక్షాలు, విసికె, ముస్లిం లీగ్  పార్టీలను విజయ్ వైపు వెళ్లకుండా కట్టడి చేయడంలో విజయం సాధించింది.  విజయ్ కేవలం కాంగ్రెస్ మీద మాత్రమే ఆధారపడితే, భవిష్యత్తులో పాలనలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉంది.

బలమైన సంఖ్య బలం ఉంటేనే స్థిరమైన పాలన
 
గవర్నర్ ఇప్పటికే మెజారిటీని నిరూపించుకున్నాకే రావాలని సూచించినట్లు వస్తున్న వార్తలు వస్తున్నాయి.  విజయ్ ఇప్పుడు నంబర్ గేమ్ లో మునిగిపోయారు. కేవలం మ్యాజిక్ ఫిగర్ కు నాలుగైదు సీట్లు ఎక్కువగా ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ ప్రమాదమే. అందుకే, కనీసం 130 నుండి 140 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే తమిళనాట జననాయగన్  పాలన సజావుగా సాగుతుంది. ఈ రాజకీయ చదరంగంలో విజయ్ వేసే తదుపరి అడుగులు తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget