అన్వేషించండి

Tamil Nadu Politics: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించని గవర్నర్ - మేజిక్ మార్క్ అందుకున్నాకే రావాలని సూచన?

Tamil Nadu Governor: విజయ్ మ్యాజిక్ మార్క్ అందుకున్న తర్వాతనే ప్రమాణస్వీకారం చేయించాలని తమిళనాడు గవర్నర్ భావిస్తున్నారు. అందుకే 112 మంది ఎమ్మెల్యేల జాబితా ఇచ్చినా ఇంకా ప్రమాణ స్వీకారానికి పిలవలేదు.

Governor not inviting Vijay to form government: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న   పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికార పీఠాన్ని అందుకోవడానికి అవసరమైన స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్‌ను నిరూపించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  

గవర్నర్ ఆచితూచి అడుగు - సంఖ్యాబలమే ప్రాధాన్యం 

టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, ప్రస్తుతానికి కేవలం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కాంగ్రెస్‌తో కలిపి ఉన్నందున, 118 మంది మ్యాజిక్ మార్కును చేరుకున్నాకే ప్రమాణ స్వీకారానికి రావాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. అతిపెద్ద పార్టీగా విజయ్‌ను ఆహ్వానించే వెసులుబాటు ఉన్నప్పటికీ, సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే మెజారిటీకి అవసరమైన సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్ కోరుతున్నారు.

 విజయ్.. కాంగ్రెస్ మాత్రమే తోడు 

కూటమి రాజకీయాల్లో విజయ్ ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. డీఎంకే కూటమి నుంచి బయటకు వస్తాయనుకున్న వామపక్షాలు,  విడుతలై చిరుతైగల్ కట్చి , ముస్లిం లీగ్ వంటి పార్టీలు తాము డీఎంకేతోనే ఉంటామని  ప్రకటించాయి. దీంతో విజయ్‌కు ప్రస్తుతం కాంగ్రెస్‌లోని ఐదుగురు ఎమ్మెల్యేలు తప్ప మరే ఇతర ప్రధాన పార్టీ మద్దతు లభించలేదు. సిద్ధాంతపరంగా భిన్నమైన అన్నాడీఎంకే మద్దతు కూడగట్టడం కూడా విజయ్‌కు అగ్నిపరీక్షగా మారింది.

వ్యూహ ప్రతివ్యూహాల్లో అన్నాడీఎంకే                            

ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నా, పార్టీ అధినేత పళనిస్వామి మాత్రం ఇప్పటికీ మౌనం పాటిస్తున్నారు. ఒకవేళ అన్నాడీఎంకే గనుక మద్దతు ఇవ్వకుంటే, విజయ్ ప్రభుత్వం ఏర్పడినా అది స్వల్పకాలికంగానే ఉండే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

సింగిల్  నినాదంపై విమర్శలు                         

ఎన్నికల ప్రచారంలో ద్రావిడ పార్టీల అవసరం లేదని, ఒంటరిగానే పోరాడతానని చెప్పిన విజయ్.. ఇప్పుడు మెజారిటీ కోసం ఇతర పార్టీల వాకిట నిలబడటంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఆయన  స్వయంశక్తి నినాదానికి విరుద్ధమని డీఎంకే శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. అధికార దాహంతోనే విజయ్ తన రాజకీయ విలువలను పక్కన పెట్టారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

చెన్నైలో ఉత్కంఠ - గడువు దగ్గర పడుతుండటంతో.. 

ప్రభుత్వ ఏర్పాటుకు  గడువు సమీపిస్తుండటంతో విజయ్ తన క్యాంపును పటిష్టం చేసే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలతో పాటు, స్వతంత్రులతోనూ రాయబారాలు నడుపుతున్నారు. మరోవైపు పరాజయం పాలైన డీఎంకే, ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష హోదాలో బలమైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద తమిళనాడులో విజయ్ పట్టాభిషేకం  జరుగుతుందా లేక రాజకీయ అనిశ్చితి నెలకొంటుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వాహనదారులకు షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Jet Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
TVK Government: తమిళనాడు సీఎంగా విజయ్ - ఖజానా ఖాళీ.. 10 లక్షల కోట్ల అప్పు.. దళపతి కి అసలైన పరీక్ష ఇప్పుడే!
తమిళనాడు సీఎంగా విజయ్ - ఖజానా ఖాళీ.. 10 లక్షల కోట్ల అప్పు.. దళపతి కి అసలైన పరీక్ష ఇప్పుడే!
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
Prateek Yadav Last Rites: అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Embed widget