అన్వేషించండి

TVK MLAs: ఒకరు నడిరోడ్డుపై తాగుతూ చిందులేశారు - మరొకరు తల్వార్‌తో కేక్ కట్ చేశారు - అప్పుడే టీవీకే ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం

TVK MLAs : టీవీకే ఎమ్మెల్యేల వివాదాస్పద ప్రవర్తన హైలెట్ అవుతోంది. ఒక్క రోజులోనే ఇద్దరు ఎమ్మెల్యేల తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

TVK MLAs controversial behavior : తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తమిళగ వెట్రి కళగం  పార్టీకి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి, గెలిచిన తొలి రోజే వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుని ఓట్లేస్తే, ప్రజాప్రతినిధులు మాత్రం బాధ్యతను గాలికొదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తంజావూరు ఎమ్మెల్యే  మత్తు  చిందులు 

తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీవీకే అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన మద్యం మత్తులో ఊగుతూ, అసభ్యంగా డ్యాన్స్ చేస్తూ కనిపించడం స్థానిక ప్రజలను విస్మయానికి గురిచేసింది.  తంజావూరు ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా  అంటూ నెటిజన్లు ఆ వీడియోను రీ-పోస్ట్ చేస్తూ విజయ్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా తాగి తందనాలడటం పార్టీ ప్రతిష్టను దిగజార్చుతోంది.    

కత్తితో కేక్ కటింగ్.. బాధ్యతారాహిత్యం 

మరోవైపు, టీవీకేకు చెందిన ఇంకొక ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకుంటూ.. ఏకంగా కత్తితో కేక్ కట్ చేయడం వివాదాస్పదమైంది. సాధారణంగా రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులు ఇటువంటి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ, చట్టసభకు ఎన్నికైన ఒక గౌరవనీయ ఎమ్మెల్యే ఇలా కత్తితో కేక్ కట్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లో శాంతిభద్రతలపై భరోసా కల్పించాల్సిన వారే ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.  

 విజయ్‌కు మొదలైన తలనొప్పులు 

ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ ఒకవైపు మద్దతు కోసం పాట్లు పడుతుంటే, మరోవైపు తన ఎమ్మెల్యేల ప్రవర్తన ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీని క్రమశిక్షణతో నడిపిస్తానని, అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు తన ఎమ్మెల్యేల ఆగడాలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అప్పుడే వీరు ఇలా ఉంటే, ఇక ఐదేళ్ల కాలంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన సామాన్య ఓటర్లలో వ్యక్తమవుతోంది.                      

 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
TPCC Chief Mahesh Kumar Goud: సీఎం రేవంత్‌తో విభేదాల్లేవు, కానీ కొండా సురేఖ విషయం బాధించింది: మహేష్ కుమార్ గౌడ్
సీఎం రేవంత్‌తో విభేదాల్లేవు, కానీ కొండా సురేఖ విషయం బాధించింది: మహేష్ కుమార్ గౌడ్
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Alla Nanis Demise: మాజీ మంత్రి ఆళ్ల నాని మృతిపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రముఖులు నివాళి
మాజీ మంత్రి ఆళ్ల నాని మృతిపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రముఖులు నివాళి

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Embed widget