Rajinikanth meets MK Stalin : స్టాలిన్‌కు రజనీకాంత్ ఓదార్పు - రాజకీయంగానూ మార్పులొస్తున్నాయా?
Rajinikanth : తమిళనాడు మాజీ స్టాలిన్‌ను రజనీకాంత్ కలిశారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్న సమయంలో ఈ భేటీ హాట్ టాపిక్ గా మారింది.

Rajinikanth meets MK Stalin after DMK election setback: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం పాలైన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్ నివాసానికి వెళ్లిన రజనీకాంత్, ఈ క్లిష్ట సమయంలో ఆయనకు తన మద్దతును ప్రకటించారు. దశాబ్దాల కాలంగా ద్రావిడ రాజకీయాల్లో చక్రం తిప్పిన డీఎంకే, ఈ ఎన్నికల్లో కేవలం 59 స్థానాలకే పరిమితం కావడమే కాకుండా.. స్వయంగా స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ సమయంలో రజనీకాంత్ పరామర్శకు ప్రాధాన్యత ఏర్పడింది.
இப்போ எதுக்கு தலைவர் ஸ்டாலின் அவர்களை போய் பாக்கணும்
— 🔥தீ🔥 (@RajiniGuruRG) May 6, 2026
மிரட்டி அழைத்து சென்றாரா
கிடையாது
ஓடுகாலியை அல்லவா சென்று பாத்திருக்க வேண்டும்
அது தான் மனிதனுக்கும் மாவீரனுக்கும் உள்ள வித்தியாசம்
தலைவர் அந்த குடும்பத்தில் வைத்த நட்பு மரியாதை.
எவன் ஆண்டாலும் ஆளுமைக்கு பயம்… pic.twitter.com/RlPvSuTQn9
ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకేలో నాయకత్వ మార్పు అనివార్యమైంది. శాసనసభలో స్టాలిన్ ప్రాతినిధ్యం లేకపోవడంతో, ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చేపాక్ ఎమ్మెల్యేగా ఉన్న ఉదయనిధి, అసెంబ్లీలో పార్టీ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఘన విజయం సాధించిన తన సహచర నటుడు విజయ్‌ను రజనీకాంత్ ఇప్పటికే ఎక్స్ వేదికగా అభినందించారు.
நடந்து முடிந்த தமிழக சட்டமன்றத் தேர்தலில் பெரும் வெற்றி பெற்ற தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு விஜய் அவர்களுக்கும், அவர் கட்சியினருக்கும் என்னுடைய வாழ்த்துகள். @TVKVijayHQ
— Rajinikanth (@rajinikanth) May 4, 2026
మరోవైపు, 108 స్థానాలను కైవసం చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే మెజారిటీ మార్కుకు 11 స్థానాల దూరంలో ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టే పనిలో విజయ్ నిమగ్నమయ్యారు. కాంగ్రెస్, వామపక్షాలు, విసికె (VCK), ఐయూఎంఎల్ వంటి పార్టీలతో టీవీకే చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమవుతోంది.
విజయ్ తాను పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో భారీ విజయం సాధించగా, ఆయన పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రజనీకాంత్ పరామర్శ, ఉదయనిధికి ప్రతిపక్ష హోదా, విజయ్ పట్టాభిషేకం వంటి పరిణామాలతో తమిళ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి.
ట్రెండింగ్ వార్తలు






















