అన్వేషించండి

TVK Vijay Give Up Trichy: టీవీకే అధినేత విజయ్‌ వదులుకునే నియోజకవర్గం ఏది? అక్కడ పోటీ చేసేది త్రిష కాదు మాజీ ఐఏఎస్‌ అధికారి?

TVK Vijay Give Up Trichy: పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ స్థానం వదులుకుంటారనే అంశంపై చర్చ మొదలైంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలిచి, ఒక స్థానానికి రాజీనామా చేయాలి.
  • తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి, పెరంబూర్‌ను కొనసాగించే అవకాశం ఉంది.
  • పెరంబూర్‌లో మాజీ ఐఏఎస్‌ అధికారి యు. సగయం పోటీ చేసే అవకాశం ఉంది.
  • ప్రజల సమస్యల పరిష్కారానికి పెరంబూర్‌ను విజయ్ తన శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవచ్చు.

TVK Vijay Give Up Trichy: తమిళనాడు ఎన్నికల్లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టీవీకే అధినేత విజయ్‌ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోయినప్పటికీ కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయనున్నారు. తమిళనాడులో 108 స్థానాల్లో విజయం సాధించగా అందులో రెండు స్థానాలు విజయ్‌వే. ఇందులో ఇప్పుడు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 14 రోజుల్లోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలి. ఇప్పుడు ఏ నియోజకవర్గాన్ని ఉంచుకొని ఏ స్థానాన్ని వదులుకుంటారో అన్న ఉత్కంఠ మాత్రం ప్రజల్లో మొదలైంది. 

రెండు చోట్ల భారీ మెజారిటీ

దళపతి విజయ్‌ తిరుచ్చి ఈస్ట్‌, పెరబూర్‌ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పెరంబూర్‌లో డీఎంకే అభ్యర్థి ఆర్డీ శేఖర్‌పై 53,715 ఓట్ల తేడాతో గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గంలో కూడా డీఎంకేకు చెందిన ఇనిగో ఇరుదయరాజ్‌ను ఓడించారు. ఇక్కడ కూడా విజయ్‌కు 27,416 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండు చోట్ల కూడా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు ఏ సీటును త్యాగం చేస్తారనే అంశంపై చర్చ నడుస్తోంది. రెండు చోట్ల కూడా హేమాహేమీలను పడగొట్టిన విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అన్న డైలమాలో ఉన్నారు. ఇదే అంశంపై పార్టీ నేతలు స్థానిక నాయకత్వంతో విజయ్ చర్చలు జరుపుతున్నారు. 

 

తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేయనున్న విజయ్

1951 సెక్షన్ 70 ప్రకారం ఒక అభ్యర్థి రెండు సీట్లలో పోటీ చేస్తే కచ్చితంగా ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. ఇది 14 రోజుల్లో పూర్తి చేసి ఎన్నికల సంఘానికి సమాచారం అందివ్వాలి. దీంతో అక్కడ ఆరు నెలలలోపు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పుడు పార్టీ వర్గాల నుంచి అందుతున్న వివరాలను పరిశీలిస్తే విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. 

తిరుచ్చి ఈస్ట్ నుంచి టఫ్‌ ఆఫీసర్

పెరంబూర్ చెన్నైకి దగ్గరగా ఉండటం, అక్కడ పార్టీకి మంచి గట్టి కేడర్ ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పుడు తన స్థానంలో గట్టి వ్యక్తి ప్రజలకు మేలు చేసే వ్యక్తిని నిలబెట్టాల్సి ఉంటుంది. అందుకే అక్కడ మాజీ ఐఏఎస్‌ అధికారి యు. సగయంను బరిలోకి దించుతారని పార్టీ వర్గాల్లో జోరుగా డిస్కషన్ జరుగుతోంది. విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిషకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని ఇప్పుడు ఐఏఎస్ అధికారి పేరు తెరపైకి వచ్చింది.  

Also Read: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు.. 2 మంత్రి పదవులకు విజయ్‌తో డీల్!

పెరంబూర్‌లో ఉండటానికి రీజన్ ఇదే

దశాబ్దాలుగా ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గెలిచినప్పటికీ కొన్ని మౌలిక వసతులు కల్పించలేకపోయారనే విమర్శ ఉంది. అందుకే అక్కడి ప్రజలు విజయ్‌ను ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నారు. ఇక్కడ పేద ప్రజలు, కార్మికులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ సామాజిక దురాచారాలు, మాదక ద్రవ్యాలు ప్రభావం చాలా ఉందని తెలుస్తోంది. వాటన్నింటి లేకుండా చేస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి అక్కడ ప్రజల మనసులు గెలుచుకున్న విజయ్ దాన్నే తన శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవచ్చనే మాట వినిపిస్తోంది.    

Frequently Asked Questions

విజయ్ ఎన్ని స్థానాల్లో గెలిచారు?

టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించారు.

విజయ్ ఏయే నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు?

విజయ్ తిరుచ్చి ఈస్ట్ మరియు పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు.

రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఏం చేయాలి?

1951 సెక్షన్ 70 ప్రకారం, రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి 14 రోజుల్లోగా ఒక స్థానానికి రాజీనామా చేయాలి.

విజయ్ ఏ స్థానానికి రాజీనామా చేయనున్నారు?

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

తిరుచ్చి ఈస్ట్ స్థానంలో ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది?

విజయ్ రాజీనామా చేసే తిరుచ్చి ఈస్ట్ స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి యు. సగయం పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Keralam CM VD Satheesan: కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
Nandigram Bypoll: బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ రెండో అంకం - మమతా బెనర్జీ రిస్క్ చేస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ రెండో అంకం - మమతా బెనర్జీ రిస్క్ చేస్తారా?
Make In Andhra Pradesh: ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్‌ను మార్చేస్తున్నట్లేనా?
ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ ఇంజిన్ నారా లోకేష్ - ఎంవోయూలే కాదు గ్రౌండింగ్ వరకు ప్రయత్నం - ఏపీ పారిశ్రామిక మ్యాప్‌ను మార్చేస్తున్నట్లేనా?
Andhra Pradesh Capital: అమరావతికి యుద్ధ గండం - పశ్చిమాసియా సంక్షోభం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తుందా?
అమరావతికి యుద్ధ గండం - పశ్చిమాసియా సంక్షోభం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తుందా?
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Spy Thrillers OTT : న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
Breaking News: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Mamata Banerjee: సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
Suriya Hit Movies On OTT: సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
Embed widget