Pavan Kurnool Tour : కర్నూలుకు జనసేనాని - 8వ తేదీన రైతు భరోసా యాత్ర !
కర్నూలు జిల్లాలో ఎనిమిదో తేదీన రైతు భరోసా యాత్ర నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పర్యటన వివరాలను నాదెండ్ల భాస్కర్ ప్రకటించారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల ( Suiside Farmers ) కుటుంబాలకు సాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pavan Kalyan ) చేస్తున్న రైతు భరోసా యాత్ర ( Raitu Bharos Yatra ) తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరగనుంది. ఇప్పటికే రెండు జిల్లాల్లో యాత్ర పూర్తి చేస్తున్నారు మొదట ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర పూర్తి చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందించారు. మూడో జిల్లాగా రాయలసీమలోని కర్నూలు జిల్లాను ( Kurnool ) ఎంచుకున్నారు. ఎనిమిదో తేదీన ఉదయం ఆయన కర్నలు జిల్లాలో అడుగు పెడతారు. పలువురు ఆత్మహత్య చేసుకున్నకౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి.. సాయంత్రం శిరివెళ్లలో ( Sirivella ) బహిరంగసభ నిర్వహిస్తారు. అక్కడ మిగిలిన వారికి ఆర్థిక సాయం చేస్తారు.
మా వైఎస్ మంచోడు - అంతా రాజారెడ్డి వల్లే ! హోంమంత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి డిఫరెంట్ కౌంటర్
జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా టూర్ వివరాలను వెల్లడించారు.
ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. లక్ష చొప్పున ( One Lakh ) పవన్ కల్యాణ్ ఇస్తున్నారు. ఇందు కోసం తన సొంత ఆదాయం నుంచి రూ. ఐదు కోట్లను పార్టీకి విరాళంగా ఇచ్చారు. కర్నూలు జిల్లాలోనూ పెద్ద ఎత్తున కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్తున్నారని తెలిసిన తర్వాత అరకొరగా కొన్ని కుటుంబాలకు మంజూరు చేస్తున్నారు. అన్ని కుటుంబాలకు ఇవ్వడం లేదని జనసేన వర్గీయులు చెబుతున్నారు. పవర్ కల్యాణ్ పర్యటన వల్లనే భయపడి ఇస్తున్నారని జనసేన నేతలు అంటున్నారు.
జంగిల్ రాజ్‌లో ప్రజలకు రక్షణ కరవు - లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని డీజీపీకి చంద్రబాబు లేఖ
ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతూండటంతో రాజకీయపార్టీలన్నీ ( Political Parties ) బరిలోకి దిగుతున్నాయి. పవన్కల్యాణ్ రైతు భరోసా యాత్ర ద్వారా గతంలో జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్ర తరహా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. మొత్తంగా పదమూడు జిల్లాలలోని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనలతో జనసేన క్యాడర్‌లో కదిలిక వస్తోంది.